ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ 18 నెలల సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?? ప్రజల మూడ్‌ని, అంచనాలను అందుకోవడంలో కూటమి సర్కార్ చేరువయిందా..??
లేదా…?? ఏ స్థాయిలో కూటమి నేతలు తమ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు..??
జగన్ సర్కార్ విఫలం కావడంతో, చంద్రబాబుకి ఇచ్చిన భారీ మేన్‌డేట్‌ని చేరుకోవడంలో కొత్త ప్రభుత్వం సఫలం అవుతోందా.?? ఎక్కడ గ్యాప్ ఉంది అనే అంశాలపై తెలుగులోని ఓ బడా టీవీ చానెల్ సర్వే నిర్వహించింది.. ఆ సర్వే రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది సర్వే చూసి కూటమి సర్కార్ నేతలు సైతం షాక్ అవుతున్నారట..ఇంతకీ ఆ సర్వేలోని సారాంశం ఏంటంటే…
కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?? అంటే సుమారు 87.5 శాతం మంది ప్రజలు బావుందని, తమ అంచనాలను మించి ఉందని సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.. కేవలం 12.5 శాతం ప్రజలు మాత్రం ఆశించిన స్థాయిలో లేదని తమ అభిప్రాయాన్ని తెలియజేశారట.. ఇందులోనూ కొంతమంది పర్లేదు అని సంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది..
కేవలం 12.5 శాతం మంది మాత్రమే కూటమి సర్కార్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే రిపోర్టులు ప్రతిపక్ష వైసీపీలో కలకలం రేపుతున్నాయి.. వైసీపీ ఓట్ బ్యాంక్‌కి ఈ సంతృప్త స్థాయి గండి కొడుతోందనేది బహిరంగ రహస్యం.. అయిదేళ్ల పాలనలో జగన్ ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారు.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో చతికిలబడ్డారు..
అందుకే, ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలను కట్టబెట్టారు ప్రజలు.. తాజా సర్వే చూస్తుంటే, ఈ దఫా ఫ్యాన్ పార్టీ సింగిల్ నెంబర్ సీట్లకి పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది..అధికారంలోకి వచ్చిన తరవాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారు.
సామాజిక పింఛన్ నాలుగు వేలు చేశారు.. తల్లికి వందనం స్కీమ్‌తో ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్క స్కూల్ విద్యార్ధికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు.. మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు, ఉచిత బస్ స్కీమ్‌తోపాటు అర్హులైన ప్రతి రైతు అకౌంట్‌లో ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్‌లో వేస్తున్నారు..
వీటితోపాటు కంపెనీలను ఏపీకి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు చంద్రబాబు.. విశాఖలో ఇటీవల జరిగిన సీఐఐ సదస్సుతో ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి.. దాదాపు మూడు నుండి నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నేడో రేపో గ్రౌండింగ్ అవుతున్నాయి.. వీటితో ఏపీలో ప్రజలు సంతృప్త స్థాయి ఊహించని విధంగా 90 స్థానానికి చేరువలో ఉంది..
ఇది వైసీపీకి భారీ డ్యామేజ్‌ని కలగజేయనుందనే సంకేతాలను పంపుతోంది.. పరిస్థితి ఇలానే కొనసాగితే జగన్ అడుగుతున్న ప్రతిపక్ష హోదా వచ్చే ఎన్నికల తర్వాత కూడా కష్టమే అని రాజకీయ పండితులు చెబుతున్న మాట..

































