పులివెందుల నుంచి షర్మిల ఔట్‌..అక్కడి నుంచే పోటీ ?

YS షర్మిల తన పని ప్రారంభించేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు.
తొమ్మిది రోజులపాటు సాగనున్న ఈ పర్యటన శ్రీకాకుళం జిల్లాతో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో షర్మిల సమీక్ష నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో సమీక్షించిన తర్వాత సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా సమీక్షను విజయనగరంలో నిర్వహిస్తారు. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల కాకుండా…. విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చియ నియోజక వర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News