షాకింగ్ ఘటన : మాజీ ప్రియురాలిని 20 సార్లు కత్తితో పొడిచిన హీరో

హాలీవుడ్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. నటుడు నిక్ పాస్క్వల్ (34) తన మాజీ ప్రియురాలిని, ఆమె నివాసంలోనే 20 సార్లు కత్తితో పొడిచి హత్యాయత్నం చేసినట్లు సమాచారం.


లాస్ ఏంజిల్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఆఫీస్ వెళ్లడించిన సమాచారం ప్రకారం. నటుడు తన ప్రియురాలిపై హత్యాయత్నం చేశారని, తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. కానీ ఆయనను పోలీసులు టెక్సాస్‌లోని US-మెక్సికో సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద పట్టుకున్నారు. అయితే ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 4.30 నిమిషాలకు షెహార్న్ నివాసంలో జరిగింది. నటుడు ఆమె ఇంటిలోకి చొరబడి తనపై పలు కత్తిపోట్లతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను తన సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక గోఫండ్‌మీ పేజీలో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అల్లీ షెహార్న్ అని పిలువబడే బాధితురాలు ఇటీవల పాస్‌వాల్‌పై నిషేధాజ్ఞను పొందిందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఇక ఘటన జరిగిన వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నటుడు గృహ హింసలో భాగంగా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచాడని, తన భాగస్వామినే కాకుండా ఇంటి సభ్యుునికి గాయం చేయడం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇవి నిజం అయితే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే చాన్స్ ఉన్నదంటున్నారు కొందరు.