Silent Walking : నిశ్శబ్దపు నడక.. ఇప్పుడిదే ట్రెండ్!

www.mannamweb.com


Silent Walking : ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం తప్పనిసరి. అలా వ్యాయామంలో భాగంగానే చాలా మంది వాకింగ్ చేస్తూంటారు.
ఎక్సర్సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం కామన్. అయితే, వాకింగ్ వల్ల బెనిఫిట్స్ పొందాలంటే సైలెంట్ వాకింగే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ సైలెంట్ వాకింగ్ గొడవేంటో చూసేద్దామా!

ఒంటరి నడక ఉత్తమం..
వాకింగ్కి వెళ్తున్నామంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూనో.. లేదా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూనో వెళ్తూంటాం. కానీ ఇది సరైన పద్దతి కాదంట. అలా వాకింగ్ చేయడం వల్ల మీ ఫోకస్ వాకింగ్ పై ఉండదట. సైలెంట్గా వాకింగ్ చేస్తేనే.. మీ ఫోకస్ వాకింగ్పై ఉంటుందని.. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిశ్శబ్దంగా వాకింగ్ చేయడం వల్ల నడకపై శ్రద్ధ పెరగడంతో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అదనపు ప్రయోజనాలు..

సైలెంట్గా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడకపై ఫోకస్ పెట్టి నడిస్తే రోజూ నడిచే దాని కంటే ఇంకొంత దూరం నడవొచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఒంటరిగా, నిశ్శబ్దంగా నడవటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏ పని మీదైనా దృష్టి పెట్టగలరు.
నిశ్శబ్దపు నడకతో ప్రతికూల ఆలోచనలు రావు. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది.