Smart Phone : స్మార్ట్ ఫోన్ పేలడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..!!

Smart Phone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను వాడను వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్లదాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.


దీంతో మార్కెట్లోకి కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్ పేలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీ కి సంబంధించినవే. అయితే ప్రతిసారి స్మార్ట్ ఫోన్ పేలి మంటలు రావడానికి తయారీదారుల తప్పు కారణం మాత్రం కాదని మనం గుర్తుంచుకోవాలి.

ఈ స్మార్ట్ ఫోన్ పేలిపోవడానికి అత్యంత ముఖ్య కారణం బ్యాటరీ లోపమే. స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీలు లియాన్ తో రూపొందించబడతాయి. ఇవి కెమికల్ బ్యాలెన్స్ ను కలిగి ఉండాలి. వీటి దగ్గర వేడి పెరిగినప్పుడు లేదా వాటి కేసింగ్ దెబ్బతిన్నట్లయితే స్మార్ట్ ఫోన్ పేలే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ లో ఉండే బ్యాటరీలు హీట్ అవుతున్నాయంటే చాలా ప్రమాదకరమైన గుర్తించాలి. ముఖ్యంగా వేడి ఉండే ప్రదేశాల్లో ఫోన్ చార్జ్ చేయడం లేదా బ్యాటరీ రాత్రిపూట చార్జ్ చేయడానికి వదిలేయడం వలన ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కాల్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించినప్పటికీ బ్యాటరీ వేడెక్కే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కి నిర్దిష్ట చార్జింగ్ సైకిల్ ఉంటుంది.

చార్జింగ్ ముగిసిన తర్వాత కూడా అలాగే ఉంచితే బ్యాటరీ హీటెక్కి త్వరగా ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉబ్బిన బ్యాటరీలను వెంటనే గమనించి వాటిని మార్చాలి. ఫోన్ చేతిలో నుండి కింద పడిపోయినప్పుడు బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే దాన్ని మార్చేయాలి. స్మార్ట్ ఫోన్ లో కనిపించే డ్యామేజ్ లేనప్పటికీ ఫోను తరచుగా కింద పడితే జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ సడన్గా కింద పడినప్పుడు బ్యాటరీ భాగాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇకపోతే కంపెనీ సిఫార్సు చేసిన చార్జర్ లనే వాడాలి. అలాకాకుండా వేరే ఛార్జర్లను వాడితే బ్యాటరీ పాడవడం లేదా తీవ్రమైన ప్రమాదాలకు కారణం కావచ్చు. అసలు ఫోన్ పేలడానికి ముఖ్య కారణం వేరే కంపెనీ ఛార్జర్లను వాడటమే.