తెలంగాణ చరిత్ర, తెలంగాణ అస్తిత్వం మీద తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తీసిన చిత్రం ఛాంపియన్.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. అటు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025 న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మూవీతో శ్రీకాంత్ కొడుకు రోషన్ హిట్టు కొట్టాడా..?
ఛాంపియన్ మూవీని తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా చెప్పుకునే సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ కథకు ఫుట్ బాల్ అంశాన్ని జోడించి తీశారు. లెజెండరీ నిర్మాత అశ్వినీదత్ స్థాపించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. డైరెక్టర్ గా ప్రదీప్ కు ఇది తొలి సినిమా కావడం విశేషం.
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం.. ఇదివరకు పలు సినిమాలకు రైటర్ గా పనిచేశారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం అంతకుముందు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు రైటర్ గానూ పని చేశారు. ఇక డైరెక్టర్ గా ఆయనకు తొలి సినిమా అయినా.. తీసిన విధానంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యథార్థ సంఘటనను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.
దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్ టైమ్ ఉన్న సినిమా మేకింగ్ పరంగా గ్రాండ్ గా ఉన్నట్లు సమాచారం. సినిమా క్వాలిటీ బాగుందని టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఎమోషన్స్ కూడా బాగా పండాయట. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సాంగ్స్ బిగ్ స్క్రీన్ పై బ్యూటిపుల్ గా ఉన్నాయని సమాచారం. ఛాంపియన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.


































