దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి యూజర్ల కోసం బంపర్ ఆఫర్ ఒకటి తీసుకొచ్చింది. రీఛార్జ్‌తో కాల్స్, డేటాతో పాటుగా అదనపు బెనిఫిట్స్ కల్పిస్తోంది.
అదనపు ఛార్జీలు లేకుండానే ఉచితంగా అందిస్తోంది. యాపిల్ భాగస్వామ్య ప్రయోజనాన్ని ఇప్పుడు ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించే ఈ బెనిఫిట్స్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. 5 నెలలు ఉచితంగా యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి
ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లు ఈ బెనిఫిట్ ఈజీగానే పొందవచ్చు. మీ ఫోన్‌లోని ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళ్లాక యాపిల్ మ్యూజిక్ ఫ్రీ ఫర్ 5 మంత్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ నంబర్‌పై యాపిల్ ఫ్రీ మ్యూజిక్ ఆఫర్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ 5 నెలల ఫ్రీ ట్రయల్ పూర్తయిన తర్వాత మీరు డీయాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నెలకు రూ. 119 చొప్పు సబ్‌స్క్రిప్షన్ ఆటో-రెన్యూవల్ అవుతుంది. మీకు తెలియకుండానే ఈ డబ్బులు కట్ అవుతుంటాయి. ఇప్పటికే చాలా మంది ప్రీపెయిడ్ యూజర్లకు ఈ ఆఫర్ థ్యాంక్స్ యాప్‌లో కనిపిస్తోంది. ఖరీదైన ప్లాన్స్ ఉపయోగించే వారికి సైతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
యాపిల్ మ్యూజిక్ వ్యక్తిగత ప్లాన్‌కు ధర ఒక నెలకు రూ. 99గా ఉంది. అదే ఫ్యామిలీ ప్లాన్ అయితే రూ. 149, స్టూడెంట్స్ ప్లాన్ రూ. 59 గా ఉంది. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ ద్వారా ప్రీపెయిడ్ యూజర్లు ఆరు నెలల వరకు ఉచితంగా పొందవచ్చు. దీంతో సుమారు రూ. 600 వరకు ఆదా చేసిన వారు అవుతారు. యాపిల్ ప్రీమియం మ్యూజిక్ క్లెయిమ్ చేసుకుంటే యాడ్-ఫ్రీ మ్యూజిక్ పొందవచ్చు. ప్రత్యేక ప్లేలిస్టులు, ఆఫ్‌లైన్ డౌన్ లోడ్స్, హై-క్వాలిటీ సౌండ్స్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఇప్పటికే చాలా రకాల డిజిటల్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ. 17000 విలువైన పర్లెక్సిటీ ఏఐ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అలాగే యాపిల్ టీవీ+ వంటివి సైతం అందించింది. అలాగే OTT సబ్‌స్క్రిప్షన్స్ సైతం అందిస్తోంది. రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ద్వారా నెట్ ఫ్లిక్స్ బేసిక్, జీ5, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, వంటివి నెల రోజులు ఉచితంగా అందిస్తోంది.
































