Summer Fruits: వేసవిలో దొరికే పుచ్చకాయ,కర్బూజా..ఆరోగ్యానికి ఏది మంచిది

ఎండాకాలం వచ్చింది అంటే చాలు మార్కెట్ లో ఎక్కడ చూసిన కూడా కర్బూజా, కళింగర, దోసకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో చాలామంది ఎక్కువగా ఖర్భుజా, పుచ్చకాయలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.


ఇవి రెండూ కూడా నీటి శాతం ఎక్కువ కలిగిన పండ్లు. వీటిని సమ్మర్ లో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇవి రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవిలో కాలంలో వచ్చే చాలా రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే పుచ్చకాయను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇందులో 90% కంటే ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది. ఈ పండు హైడ్రేషన్ పవర్‌హౌస్‌ అనడంలో ఆశ్చర్యం లేదు. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటి శాతంతో పాటు, విటమిన్ ఎ, సిలకు మంచి మూలం అని చెప్పవచ్చు.

అలాగే వేసవికాలంలో విరివిగా లభించే పండ్లలో మస్క్‌మిలన్ కూడా ఒకటి. దీనినే కర్బూజా అని కూడా పిలుస్తారు. ఇది తీపి వాసనతో ఆరెంజ్ రంగుతో అందంగా కనిపిస్తుందట. పుచ్చకాయతో పోలిస్తే కర్బూజాలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ ను అందిస్తుందట. దీనిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. దీనిలోని బీటాకెరోటిన్ క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తాయట. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయట. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందట. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందట.

మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. రెండు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరానికి తేమను రిఫ్రెష్‌ గా అందిస్తాయి. అయితే పుచ్చకాయలో నీటి శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కర్బూజ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. మొత్తానికి ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో రెండూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. సమ్మర్లో శీతల పానీయాలకు బదులుగా ఈ పండ్లను జ్యూస్ రూపంలో లేదంటే నేరుగా కూడా తినవచ్చు అని చెబుతున్నారు..