కేంద్రం సూపర్ స్కీమ్.. ప్రతి విద్యార్థి సులువుగా రూ.4 లక్షలు పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తున్నా చాలా పథకాలకు సరైన ప్రచారం దక్కడం లేదు. అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో కొన్ని పథకాల ద్వారా విద్యార్థులకు అదిరిపోయే ప్రయోజనాలు లభిస్తున్నాయి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్ పేరుతో మోదీ సర్కార్ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.


యువతకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుని సులువుగా ఉద్యోగం సాధించవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా కేంద్రం ఇచ్చే మొత్తాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కోర్సు కోసం ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఇతర ఖర్చుల కోసం కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను ఉపయోగించవచ్చు.

విద్యార్థి అవసరాలను బట్టి లోన్ మంజూరు కానుండగా గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ విషయంలో రుణం ఇచ్చే సంస్థను బట్టి వడ్డీ రేటు మారుతుంది. తీసుకున్న రుణాన్ని 7 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఎవరైతే రుణాన్ని తీసుకుంటారో వాళ్లు 7 సంవత్సరాలలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్ స్కిల్ కార్పొరేషన్ మద్దతు ఉన్న సంస్థలో ప్రవేశం పొందిన వాళ్లు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకుని స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ , నివాస ధృవీకరణ పత్రం, అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.