ఏపీ ప్రజలకు తీపికబురు.. సంక్రాంతి నుంచి ఉచితం, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు

రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రభుత్వ సేవలను వచ్చే సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందించాలని ఆర్టీజీఎస్‌ (RTGS) వ్యవస్థపై జరిగిన సమీక్ష సందర్భంగా సూచించారు.


ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ సేవలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని, తద్వారా ప్రభుత్వ పనితీరుపై వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కొన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికీ ప్రజలకు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తించారు. అలాంటి శాఖలు వెంటనే తమ పని విధానాన్ని మార్చుకోవాలని, ప్రజలకు ఆన్‌లైన్‌లోనే సేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవుతుందని, పనులు సులభతరం అవుతాయని తెలిపారు. ఆన్‌లైన్ సేవలకు సంబంధించి ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై నేడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.

రిజిస్ట్రేషన్ల తర్వాత పత్రాలను కొరియర్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు పంపేలా ప్రణాళికల్ని సిద్ధం చేయాలన్నారు చంద్రబాబు. ఆన్‌లైన్ సేవలు పారదర్శకతను పెంచుతాయని.. ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తిని మెరుగుపరుస్తాయన్నారు. ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచాలని, బస్టాండ్ ప్రాంగణాలు, పరిసరాలు, మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రత పాటించాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని.. రైతులకు డ్రోన్ల సహాయంతో పురుగుమందుల వాడకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో అవగాహన కల్పించాలన్నారు. కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర జిల్లాల్లో కూడా అమలు చేసేలా చూడాలన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర వృద్ధిరేటుపై నేడు సచివాలయంలో మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు. ‘విధ్వంసమైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, నిర్వీర్యమైన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరిస్తున్నాము. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని, వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నాము. విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని, సాగునీటి వ్యవస్థను సమర్ధంగా నిర్వహిస్తున్నాము. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించడం ద్వారా పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నాము’ అన్నారు ముఖ్యమంత్రి. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీరో పావర్టీ -పీ4 పై సమీక్ష నిర్వహించారు. పీ4 అమలులో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వే అంశాలపై ప్రధానంగా చర్చించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.