పాక్ క్రికెటర్‌తో తమన్నా భాటియా పెళ్లి .. అసలు విషయం చెప్పిన మిల్కీ బ్యూటీ

 మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లి గురించి ఇటీవల అనేక ప్రచారాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు తమన్నా.


మూడు పదుల వయసు దాటినా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టని తమన్నా, పలువురిని వివాహం చేసుకోబోతుందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరగగా, తాజాగా ఈ రూమర్స్‌పై ఆమె స్పష్టత ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా సోషల్ మీడియాలో ఇలాంటి గాసిప్స్‌ ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. గతంలో ఒకసారి జ్యువెల్లరీ షాపు ఓపెనింగ్ కోసం అబ్దుల్ రజాక్‌తో కలిసి వెళ్లాను. అంతే కానీ మాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదు.

ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కలిసి కనిపించినంత మాత్రాన పెళ్లి రూమర్స్‌ రావడం ఆశ్చర్యంగా ఉంది అని తెలిపారు తమన్నా. అలాగే ఒకప్పుడు విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసారన్న వార్తల గురించి కూడా మాట్లాడుతూ.. ఒక్కసారి మాత్రమే నేను విరాట్‌ను కలిసాను. ఆ క్షణమే అనేక రూమర్లు వచ్చాయి. ఆ టైంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నిజానికి అప్పటి తరువాత మళ్లీ విరాట్‌ను కలిసే అవకాశమే రాలేదు అని తెలిపారు.మొత్తానికి కొంత కాలంగా తమన్నా పెళ్లికి సంబంధించి అనేక రూమర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ భామ ఇచ్చిన క్లారిటీతో పుకార్లకి పులిస్టాప్ పడినట్టే అని చెప్పాలి.

కొద్ది రోజుల క్రితం తమన్నా.. విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉంది. కలిసి సరదాగా తిరిగారు. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కాని ఉన్నట్టుండి వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇంత వరకు ఈ ఇద్దరు కూడా వారి బ్రేకప్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అభిమానులు, మీడియా తన వ్యక్తిగత జీవితంపై అవాస్తవ వార్తలు సృష్టించవద్దని కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.