టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి

గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి (89) మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.


హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ భూపాల్ రెడ్డి మరణించారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. కాగా, 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి రామ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.