బల్లపై కాళ్లు పెట్టి..గురకపెట్టి గాఢ నిద్రలోకి టీచర్‌

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్‌ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. “మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? అని ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.