Teacher Logo – Fact check -టీచర్స్ లోగోను సుప్రీంకోర్టు ఆమోదించిందా.. ఇదీ నిజం..!

టీచర్స్ కంటూ ప్రత్యేకంగా ఓ లోగో వచ్చేసిందని… ఇకపై దాన్ని టీచర్స్ తమ వాహనాలపైనా, నేమ్ బోర్డ్స్ పైనా వాడచ్చంటూ సోషల్ మీడియాలో ఓ లోగో విపరీతంగా వైరల్ అవుతోంది. సుప్రీం కోర్టు కూడా దీన్ని ఆమోదించిందని డాక్టర్స్, లాయర్లు లాగా టీచర్లు కూడా ఇకపై వారికోసం ప్రత్యేకంగా తయారు చేసిన లోగోను తమ కార్డ్స్ పైన ముద్రించవచ్చని ట్విట్టర్, వాట్సప్, ఫేస్ బుక్ లలో వైరల్ అవుతోంది. ఆ లోగో మీద అరచేతులు, బుక్, పెన్, సూర్యుడి బొమ్మ ఉంది.. అలాగే ‘I want, I can, I will ‘ అన్న పదాలు ఉన్నాయి.

www.mannamweb.com


దీంతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ‘టీచర్లూ.. మీకు శుభాకాంక్షలు.. ఇకపై టీచర్లు కూడా లోగోని తమ తమ వాహనాలపై గర్వంగా వేయించుకోవచ్చు..
దేశాన్ని నిర్మించే(nation builder) గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు’ అంటూ పలువురు ట్వీట్ చేశారు. కొందరు ఈ లోగో నిజమేనేమో అని నమ్మేశారు.
దీంతో గూగుల్ లో ఆ ఇమేజ్ ను ఉంచి రివర్స్ సెర్చ్ చేయగా ‘Teachers logo for vehicles’ అనే కీవర్డ్స్ కనిపించాయి. అంతేకాదు ఈ లోగో 2017 నుండి ఆన్ లైన్ లో వైరల్ అవుతూనే ఉంది. ట్విట్టర్ లోనే కాదు ఫేస్ బుక్ లో కూడా దీన్ని పలువురు షేర్ చేయడం జరిగింది.

ఈ లోగోను మొదట అఫీషియల్ గా విడుదల చేసింది లూధియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే వ్యక్తి. 


ఆయన పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగానూ, ప్రధానోపాధ్యాయుడిగానూ పని చేశారు. తన ఫేస్ బుక్ పేజీలో టీచర్స్ లోగో ను రూపొందించింది తానేనని చెప్పుకొచ్చారు. అలాగే తన లోగోను సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ను అందులో పోస్టు చేశాడు. సుప్రీం కోర్టు ఆయన రూపొందించిన టీచర్స్ లోగోను ఆమోదించడం మాత్రం పచ్చి ‘అబద్ధం’.

నిజమెంత:
ఈ లోగో గురించి సుప్రీం కోర్టు ఎటువంటి అధికార ప్రకటనను చేయలేదు. సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ ను చూస్తే ప్రతి ఒక్కరికీ ఆ విషయం స్పష్టమవుతుంది. PIB Fact Check కూడా దీన్ని ఫేక్ న్యూస్ గా చెప్పుకొచ్చింది. అఫీషియల్ లోగో అన్నది పూర్తిగా తప్పుడు వార్త అని PIB Fact Check పేజీ కొట్టి పారేసింది.