Tech Tips స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.. మీ కళ్లను కాపాడుకోండి..

Tech Tips ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. మన నిత్య జీవితంలో అదొక భాగంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలా ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్ వాడే వారు ఐ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నారని పలు నివేదికల్లో వెల్లడైంది. ఇదిలా ఉండగా.. మనం ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు అనేక విషయాలను చెక్ చేస్తాం.. బ్యాటరీ, పర్మార్ఫెన్స్, కెమెరా, స్టోరేజీ ఇలా అనేక ఫీచర్ల గురించి కంపేర్ చేసి మరీ కొంటుంటాం. అయితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కొత్త ఫోన్ కొనేటప్పుడు లేదా పాత స్మార్ట్‌ఫోన్ రెగ్యులర్‌గా వాడుతుంటే మీ కళ్లకు సంబంధించి కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీ కళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
డిస్‌ప్లే విషయంలో..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు, అది AMOLED లేదా Super AMOLED డిస్ ప్లేతో వస్తుందో లేదీ చెక్ చేయండి. ఈ డిస్ ప్లేలు LCD కంటే అధునాతనమైనవి. ఈ డిస్‌ప్లే మంచి బీమ్ పవర్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఇవి తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటాయి. ప్రస్తుతం దాదాపు అన్నీ కంపెనీలు AMOLED డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నాయి.
స్క్రీన్ ప్రొటెక్టర్..
ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుందన్న విషయం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కళ్లకు మాత్రమే కాదు.. నిద్రకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. అందుకే స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్‌ను ట్రై చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఫాంట్ సైజ్ పెంచండి..
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడే వారి కంటిపై అధిక ఒత్తిడి పడుతుంది. మీరు వాడే స్మార్ట్‌ఫోన్‌లో బ్రైట్‌నెస్‌, టెక్స్ట్ సైజ్ కళ్లపై ప్రభావం చూపుతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగులను మార్చేందుకు అవకాశం ఉంటుంది. చిన్న సైజు టెక్స్ట్ మీ కంటిపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. అందుకే వీలైనంత మేరకు మీ ఫాంట్ సైజ్ పెంచుకోండి. దీని వల్ల మీ కంటిపై కొంతమేరకు ఒత్తిడి తగ్గొచ్చు.

ఇవి వాడండి..
మీ స్మార్ట్‌ఫోన్‌ను రాత్రి వేళ లైట్లు ఆఫ్ చేశాక వాడటం మానేయండి. ఎందుకంటే దీని వల్ల కళ్లపై వేగంగా ప్రభావం పడుతుంది. వాస్తవానికి రాత్రి వేళలో కూడా కళ్లపై ఫోన్ లో నుంచి వచ్చే లైటింగ్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ ఫోన్లో కచ్చితంగా నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ప్రస్తుతం వచ్చే చాలా స్మార్ట్‌ఫోన్లలో ఈ నైట్ మోడ్ ఆప్షన్ వస్తోంది. అలాగే రాత్రి వేళ ఫోన్ చూస్తూ చదవడం, రాయడం వంటివి పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే ఫోన్లో ఉండే బ్లూ లైట్ కంటి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే పైన చెప్పిన విధంగా బ్లూలైట్ ఫిల్టర్‌ను వాడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *