తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, ఆయా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సుమారు ఆరు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.
తొలి విడత పోలింగ్ దృష్ట్యా 10, 11 తేదీల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చారు. రెండో విడత ఎన్నికల సందర్భంలో 13వ తేదీ (రెండో శనివారం), 14వ తేదీ (ఆదివారం) వస్తుంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా 16, 17 తేదీల్లో సైతం ఆయా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సామాగ్రి సిద్ధం చేయాల్సి ఉన్నందున ఈ సెలవులను పొడిగించడం జరిగింది. అలాగే, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు నెలవారీ వేతనంతో కూడిన సెలవును 11వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత పోలింగ్ కోసం 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించిన స్కూళ్లు, మూడో విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో 16, 17 తేదీల్లో కూడా మూతపడనున్నాయి. ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని పొందుతున్నారు.


































