Peru – బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం -19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

www.mannamweb.com


బండరాయిలో గుడి… గుళ్లొ రహస్యం
అదో పురాతన గుడి. అన్ని గుడుల్లాంటిది కాదు. మిగతా గుడులకూ దానికీ చాలా వ్యత్యాసముంది. దాన్ని కట్టిన విధానమే కాదు… దాని చరిత్రలో దాగున్న రహస్యాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి.
పెరూలోని కస్కో అనే పట్టణానికి సమీపంలో ఉందా గుడి. 15వ శతాబ్దం కాలానికి చెందిన ఇన్‌కాన్‌ రాజ్య పాలకులు దాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో ఐరోపా సేనలు ఇన్‌కాన్‌ సామ్రాజ్యంపై దాడి చేసి కోటలు, గుడులను నేలమట్టం చేశాయి. అయితే ఈ గుడిని మాత్రం అలాగే వదిలేశాయి.

* ఇదో ఏకశిలా నిర్మాణం. కొండల సమీపంలో ఉన్న ఓ పేద్ద రాయిని తొలుస్తూ ఈ గుడి మొత్తాన్ని నిర్మించడం విశేషం. ఈ గుడికి చేరుకోవడానికి మెట్లను సైతం అదే రాయిలో తొలిచారు.

* గుడి ప్రాంగణంలోనూ అద్భుత నిర్మాణాలున్నాయి. కొండల్లో సహజసిద్ధంగా ఉన్న గుహలను కలుపుతూ విశాలమైన గదులను నిర్మించారు

* 19 చిన్న చిన్న గదులను కలుపుతూ నిర్మించిన ఓ విశాలమైన గది అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

* ఈ గుడిలో కాలువ లాంటి నిర్మాణం ఉంది. అందులో రక్తం లేదా ఎర్రటి ద్రవపదార్థం సంవత్సరాల తరబడి పారినట్లు ఆధారాలు లభించాయి. దీన్ని బట్టి ఇన్‌కాన్‌ రాజ వంశీకులు తాము ఆరాధించే స్వర్గదేవతలకు రక్త తర్పణం చేసే ఆచారం ఇక్కడ కొనసాగి ఉండొచ్చని భావిస్తున్నారు.
* ఈ గుడిలో ఎలాంటి విగ్రహాలు లేవు. అప్పటి ప్రజలు సూర్యచంద్రులను పూజించేవారని, అందుకే ఇక్కడ విగ్రహాలు లేవని కొందరంటారు.