అదేంది పంతులమ్మ.. వాళ్లు అంత తప్పేం చేశారు..! విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు చితకబాదిన టీచర్

ఈ మధ్య కాలంలో కొందరు ప్రైవేట్ స్కూల్‌ టీచర్స్ విద్యార్థుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తెలిసితెలియని వయస్సులో వారు చేసే తప్పులను సరిదిద్దాల్సింది పోయి. వారిని గొడ్లను బాధినట్టు బాదుతున్నారు. హోంవర్క్ చేయలేదని.. ఒక ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల నర్సరీ విద్యార్థిని చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువక ముందే.. ఒక ప్రైవట్ స్కూల్‌ టీచర్స్ విద్యార్థులను చితకబాదిన ఘటన వెలుగు చూసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఇందుకు సంబంధించిన వీడియో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది.

జౌన్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు పిల్లలను దారుణంగా కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఉపాధ్యాయుడు పదే పదే పిల్లలను చెంపదెబ్బ కొట్టడం, కర్రతో కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు ఆ టీచర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జౌన్‌పూర్‌లోని బద్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భలువాహిలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల నుండి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.


వైరల్‌ వీడియో ప్రకారం.. తరగతి గదిలోని కొందరు పిల్లల నిల్చోపెట్టిన టీచర్ వాళ్లని ఒక్కొక్కరిగా ప్రశ్నలు అడుగుతూ వాళ్లను కొట్టడం చూడవచ్చు. ఈ క్రమంలో ఆమె కొపంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. మిమ్మళ్ని రోజూ కోడుతున్నా.. మీరు ఎలాంటి మార్పు రావట్లేదు.. ఎప్పుడు అడిగినా.. మేడం రేపు నేర్చుకుంటా అని అంటున్నారని అనడం మనం వినవచ్చు. అయినా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వక పోవడంతో ఆమె వాళ్లను కొడుతూనే ఉంది.

అయితే దీన్ని గమనించిన కొందరు టీచర్ విద్యార్థులను కొడుతున్న దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వారి.. టీచర్ తీరుపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ఈ టీచర్ ఇంట్లో కొపాన్ని తెచ్చి పిల్లలపై చూపిస్తుందని ఆరోపించారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. సంబంధిత పాఠశాలకు నోటీసు జారీ చేశామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆ పాఠశాల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలపై ఎలాంటి శారీరక హింసను సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.