అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏపీ సర్కార్‌ తీపికబురు

రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గుడ్‌న్యూస్‌ చెప్పారు. అమరావతి నిర్మాణానికి భూమలు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ నెల 23న కేటాయిస్తామని తెలిపారు.


రెండో విడత భూసేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రైతులకు వేగంగా ప్లాట్లు కేటాయించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ప్లాట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ఈ – లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తామని, రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలిపారు. రాజధాని రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.