భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దేశ రైల్వే చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇప్పటికే వివిధ విభాగాలు షెడ్యూల్ ప్రకారం పూర్తవుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశగా సూరత్ నుంచి బిలిమోరా వరకు ఉన్న విభాగం నిర్మాణాన్ని పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ విభాగానికి సంబంధించిన నిర్మాణ పనులు డిసెంబర్ 2026 నాటికి పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సెక్షన్ పూర్తయిన తర్వాత, వాపి నుంచి అహ్మదాబాద్ వరకు ఉన్న తదుపరి విభాగాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తారు. ఈ రెండో దశ పనులు 2027 మొదటి అర్ధభాగంలో పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. అనంతరం, బుల్లెట్ రైలు సేవలను థానే మార్గంగా ముంబై వరకు విస్తరించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ దేశంలోని హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌కు కొత్త కోణాన్ని అందిస్తుంది, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు.
పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.
ఇటీవల, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు 2029 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, గూగుల్ మ్యాప్స్‌లో చూపిన తొమ్మిది గంటలతో పోలిస్తే, బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య దూరాన్ని రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకుంటుంది. మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పురోగతి చాలా బాగుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2028 నాటికి, థానే-అహ్మదాబాద్ విభాగం పనిచేయడం ప్రారంభిస్తుంది. మొత్తం ముంబై-అహ్మదాబాద్ లైన్ 2029 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇదిలా ఉండగా, సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌లో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం స్టేషన్ పరిసరాల్లో ట్రాక్ వేయడం, ఫినిషింగ్ పనులు, విద్యుత్ మరియు ఇతర యుటిలిటీ పనులు కొనసాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోలర్ బేరింగ్‌లు, కాంపోజిట్ స్లీపర్‌లు వంటి ఆధునిక భాగాలతో మొదటి టర్నౌట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు
ఈ మార్గంలో ప్రధాన లైన్‌ను గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైలు నడిచేలా డిజైన్ చేయగా, స్టేషన్ల వద్ద లూప్ లైన్‌ను గంటకు 80 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా రూపొందించారు. ఈ సాంకేతిక ఏర్పాట్లు బుల్లెట్ రైలు సురక్షితంగా, స్థిరంగా మరియు అత్యంత వేగంగా ప్రయాణించేందుకు దోహదపడతాయి. మొత్తంగా చూస్తే, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు. దీనికి ప్రయాణీకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గత కొన్నేళ్లుగా ఇండియన్ రైల్వే సాంకేతిక పరంగా ప్రయాణీకులక కొత్త అనుభూతులను పంచుతోంది. రోజుకు లక్షలాది మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది.
Post Views: 2
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.