ఆధార్-పాన్ లింక్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ఇలా చేస్తే కుదరదట.. మళ్లీ చేసుకోండి..

ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది.


ఎప్పటికప్పుడు ఇందుకు గడువు పొడిగిస్తున్న ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఏడాది చివరి వరకు టైమ్ ఇచ్చింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికీ ఇంకా లింక్ చేసుకోనివారు వెంటనే చేసుకోవడం మంచిది. ఇప్పటికే అనేసార్లు ఇందుకు గడువు పొడించారు. దీంతో ఈ సారి మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉందా? లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ మీరు ఆధార్-పాన్ లింక్ చేసుకోకపోతే గడువు తేదీ తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశముంది. పాన్ కార్డులను రద్దు చేసే అవకాశముంది. దీని వల్ల మీరు ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు.

అయితే కొంతమంది ఆధార్ కార్డుతో కాకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌తో పాన్ కార్డు పొంది ఉంటారు. ఇలాంటివారు ఆధార్ నమోదు సంఖ్యతో పాన్ లింక్ అయి ఉంటుందని, తాము మళ్లీ లింక్ చేయాల్సిన అసవరం లేదనుకుంటారు. కానీ అలా కుదరదట. కేవలం ఆధార్ కార్డు నెంబర్‌తో పాన్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారు కూడా డిసెంబర్ 31లోపు ఆధార్ నెంబర్‌తో పాన్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డులు ఇనాక్టివ్ అయ్యే అవకాశముంది. లింక్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచితంగా చేసుకోవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139 ఏఏ (2ఏ) ప్రకారం ఆధార్‌తో పాన్ లింక్ చేయడం అనే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2017, జూలై 1 కంటే ముందు పాన్ కార్డు పొందిన వారందరూ లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత పొందినవారు కూడా తమ ఆధార్‌తో పాన్ లింక్ అయిందో.. లేదో చూసుకోవాలి. లేకపోతే వెంటనే చేసుకోవావాలని కేంద్రం పదే పదే చెబుతోంది. ఇప్పటికీ కొంతమంది ఇంకా లింక్ చేసుకోలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వీరి కోసం డిసెంబర్ 31 వరకు డెడ్ డైన్ విధించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.