తిరుపతి వెళ్లే భక్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వరంగా మారనుంది. దేశ వ్యాప్తంగా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా తిరుపతి ఏయిర్ పోర్టు నుంచి భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు. ఇక, ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ సిద్దం అవుతోంది. రాకపోకలు మరింత సులువగా సాగించేలా నిర్ణయం అమలు అవుతోంది.
ప్రపంచ స్థాయిలో తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రాను న్నాయి. నిత్యం లక్షన్నర మందికి పైగా భక్తులుమరింత సులభంగా.. అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం, భవన నిర్మాణం ప్రారంభం కాగా.. ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణ వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయింది. రాబోయే మే లేదా జూన్ నెల నాటికి ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అధునాతన సౌకర్యాలు తిరుపతిలో సౌత్ సైట్ స్టేషన్ బిల్డింగ్ తోపాటు జీ ప్లస్ త్రీ భవనంలో ఎయిర్ కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్‌లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియా తో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్ కాన్ కోర్స్ రానున్నాయి. బేస్మెంట్ లో 200 ఫోర్ వీలర్స్, 300 కు పైగా టూ వీలర్స్ కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సేవరేజ్ ట్రీట్మెం ట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరగనున్నాయి. దక్షిణం వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో మూడు అంతస్తులను కలిగి ఉంటుంది.
లక్షన్నార మంది ప్రయాణీకులు ఇప్పటిదాకా రూ.143.68 కోట్లు ఖర్చు చేసి దాదాపు 56 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫిమేల్ వెయిటింగ్, ఏరియా ఫుడ్ కోర్ట్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులను చేపట్టింది. థర్డ్ ఫ్లోర్ లో రన్నింగ్ రూమ్, టిటీఈలకు రెస్ట్ రూములు, రైల్వే ఆఫీసులతోపాటు 8 లిఫ్టులు, 2 ఎస్కలే టర్లను నిర్మిస్తోంది. ఎంపీ గురుమూర్తి ఈ పనులను పర్యవేక్షించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో టికెట్ కౌంటర్లు, విశ్రాంతి గదులు ఉంటాయి. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90 వేల మంది యాత్రికులకు సేవలందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోడ్రైజేషన్ తో రోజూ 1.50 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది.
కాన్ కోర్స్ నిర్మాణం విమానాశ్రయం తరహాలో నిర్మిస్తున్న కాన్‌కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది స్టేషన్ దక్ షిణం, ఉత్తరం వైపు భవనాలను కలుపుతూ ఉంటుంది. ఈ కాన్‌కోర్స్ కింద ఆరు ప్లాట్‌ఫాంలు ఉంటాయి. ప్రయాణికులు పైనుంచి తమకు కావలసిన ప్లాట్‌ఫాంకు చేరుకోవడానికి ప్రతి ప్లాట్ ఫాంకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైలు వచ్చే వరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కాన్‌కోర్స్‌పై అందుబాటులో ఉంటాయి. ఈ ఆధునికీకరణతో తిరుపతి రైల్వే స్టేషన్ ఒక కొత్త రూపును సంతరించుకోనుంది. ఇది ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుంది
































