‘బిగ్ బాస్ 9’ ఫస్ట్ ఫైనలిస్ట్, టాప్ 5 ఫైనలిస్ట్స్ ఎవరో తెలిసిపోయిందిగా…

‘బిగ్ బాస్ 9’ చివరి దశకు చేరుకుంది. 88 వ రోజు ఆట రసవత్తరంగా సాగింది… కాంటెస్టెంట్స్ అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫస్ట్ ఫైనలిస్ట్ పోటీ ని బిగ్ బాస్ నిన్న కండక్ట్ చేయడం విశేషం…పవన్ తనూజ, సుమన్ శెట్టి, ఈ పోటీ నుంచి ఔట్ అవ్వగా రీతూ చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురి మధ్య చాలా టఫ్ ఫైట్ జరిగింది. వీళ్ళ ముగ్గురికి పరీక్ష పెడుతూ బిగ్ బాస్ చాలా గొప్ప మాటలు చెప్పాడు… ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది… గొంగళి పురుగు ఎలాంటి దశలను ఎదుర్కొని సీతాకోక చిలుకగా మారుతోంది…మీరు కూడా ఈ ఫైనలిస్ట్ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా ఎదుర్కొని మొదటి ఫైనలిస్ట్ లుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటూ బిగ్ బాస్ చెప్పడం విశేషం…


ఇక ఈ టాస్క్ లో కళ్యాణ్, రీతూ, ఇమాన్యుయల్ ముగ్గురికి మూడు స్టిక్స్ ఇచ్చారు.దాని మీద కాయిన్స్ నిలబెట్టే అవకాశాన్ని మిగిలిన కంటెస్టెంట్స్ కి ఇచ్చారు. ఇక టాస్క్ ఆడుతున్న కంటెస్టెంట్ ఒక్క చేతితో స్టిక్ పట్టుకొని అటుఇటు కదులుతూ ఉండాలి. కానీ స్టిక్ మీద ఉన్న కాయిన్స్ కింద పడకూడదు…

ఇక ఈ టాస్క్ లో రీతూ చాలా బాగా ఆడింది విజయం సాధించింది… ఇప్పుడు రీతూ కనక మొదటి ఫైనలిస్ట్ గా వెళితే మాత్రం టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్స్ లిస్ట్ మారిపోయే అవకాశం ఉంది… ఇంతకు ముందు వరకు టాప్ 5 లో ఉండేవాళ్లలో టాప్ 3 లో కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ ఉంటారనే విషయం మనందరికి తెలిసిందే…

ఇక రీతూ టాప్ వన్ కంటెస్టెంట్ గా వెళితే సుమన్ శెట్టి, సంజన, భరణి ముగ్గురిలో ఎవరో ఒక్కరికి మాత్రమే టాప్ 5 లోకి వెళ్ళే అవకాశం దక్కుతోంది… కాబట్టి వీళ్ళందరు రాబోయే రోజుల్లో టాస్క్ లను బాగా ఆడి వాళ్ల టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని టాప్ 5 లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది… చూడాలి మరి టాప్ 5 లోకి వచ్చే కాంటెస్టెంట్స్ ఎవరు అనేది…

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.