పట్టాలెక్కిన ఫస్ట్‌ ప్రైవేట్‌ రైలు! టిక్కెట్‌ ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్ ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సుదరూ ప్రయాణాలు చేయాలనుకునేవారికి రైల్వే ప్రయాణం ఎంతో సురక్షితం, సౌకర్యం అని భావిస్తుంటారు. భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగంలోకి వస్తాయి. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తుంది. రైల్వే టికెట్ తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ అందుకే మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా రైల్ ప్రయాణాలు చేస్తుంటారు. భారతీయ రైల్వేలు కార్పోరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో అదే స్థాయిలో నిర్వహణ శైలిని అలవర్చుకుంటుంది. తొలిసారిగా ప్రైవేట్ రైల్ పట్టాలెక్కింది. ఏ రాష్ట్రం.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రైల్ పట్టాలెక్కనుంది. కేరళ నుంచి ప్రైవేట్ రైలు సర్వీస్ తిరువనంత పురం నుంచి జూన్ 4న ప్రారంభం కానుంది. భారతీయ రైల్వే భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట లో భాగంగా ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్స్ ద్వారా ఈ కొత్త రైల్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే టికెటింగ్ తో పాటు ఇతర సేవలు జరుగుతున్నప్పటికీ ఎస్ఆర్ఎంపీఆర్ ద్వరా రైలు, సిబ్బంది ఇతర సౌకర్యాలు అందించబడతాయని ప్రిన్సీ ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ తెలిపారు. ఈ రైల్లో అన్ని వసతులు చాలా క్లాస్ గా ఉంటాయని.. ఒక్కసారి ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తే ఆ అనుభవమే వేరు అని అన్నారు.

ఈ ట్రైన్ గోవా, ముంబై, అయోధ్యకు సర్వీసులు నిర్వహిస్తుంది. మొదటి ప్రయాణం గోవా.. ఇందుకోసం ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, త్రిసూర్, కొజికోడ్, ఎర్నాకులం, కన్నూర్, కాసర్గోడ్ స్టేషన్లలో ఎక్కవుచ్చు. ఈ ట్రైన్ లో ఒకేసారి 750 మంది వరకు ప్రయాణం చేసే వెసులుబాటలు ఉంది. ఈ ట్రైన్ లో 2 స్లీపర్ క్లాస్ బోగీలు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్, 2 సెకండ్ క్లాస ఏసీ కోచ్ లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు వైద్య నిపులు, 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ ట్రైన్ లో ఆహారం, వై-ఫై సౌకర్యలు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందించబడుతుంది. ఈ ట్రైన్ లో సందర్శన స్థలాలు టూర్ ప్యాకేజ్ లో భాగంగా ఉంటాయి.

నాన్ – ఏసీ స్లీపర్ లో 4 రోజులు గోవా ట్రిప్ కోసం, ఒక్కొ ప్రయాణికుడు రూ.13,999 చెల్లించాల్సి ఉంటుంది. 3 టైర్ ఏసీ అయితే రూ.15,150, 2టైర్ ఏసీ అయితే రూ.16,400 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక ముంబై ట్రిప్ కోసైం రూ.15,050, రూ.16,920, రూ.18,825 గా నిర్ణయించారు. అయోధ్య కోసం 8 రోజుల యాత్రకు రూ.30,550, రూ.33,850, రూ.37,150 గా చార్జీలు ఉన్నాయి. 10 ఏళ్ల వయసు లోపు పిల్లలకు టిక్కెట్టు ఫ్రీ.. ఆ పై వయసు పిల్లలకు హాఫ్ టికెట్. ఈ యాత్ర అయోద్య,వారణాసి, ప్రయాగ్ రాజ్ లోని దేవాలయాలు, యాత్రా స్థలాలను కవర్ చేస్తుంంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *