భారత్ లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఇవాళ ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. హౌరా-కామాఖ్య మార్గంలో దీన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే ఈ ప్రీమియం రైలుకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను, ఫొటోలను రైల్వే శాఖ షేర్ చేసింది. ఇప్పటికే పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్లీపర్ రైళ్ల రాక రైల్వే రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతోంది.



































