ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినీరంగాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? ఇంతకీ సన్యాసిగా మారాల్సి వచ్చిందనే విషయాలు తెలుసుకుందామా. ?
సినీరంగంలో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీలో మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లు చాలా మంది గ్లామర్ ప్రపంచాన్ని వదిలి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. కొందరు అతి పెద్ది సూపర్ స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఓ హీరోయిన్.. అన్నింటినీ విడిచిపెట్టి బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ బర్ఘా మద. ఆమె మాజీ మోడల్. 1996లో అక్షయ్ కుమార్, రేఖలతో కలిసి ఖిలాడియోం కా ఖిలాడి చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
బర్ఖా మదన్ 1994లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేతలు సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లతో కలిసి పోటీపడి, నటన వైపు దృష్టి పెట్టింది. ఆ తర్వాత 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన భూత్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ మూవీ తర్వాత బర్ఖా మదన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాల్లో నటించింది. కెరీర్ మొత్తం దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోలలోనూ కనిపించింది. కానీ 012లో బర్ఖా మదన్, అన్నింటినీ వదులుకుని బౌద్ధ సన్యాసిని కావాలని నిర్ణయించుకుంది.
బౌద్ధమతం భావాలకు ఆకర్షితురాలైన బర్ఖా మదన్ తన విజయవంతమైన వృత్తిని విడిచిపెట్టింది. బర్ఖా మదన్ సెరా జే ఆశ్రమం నుండి సన్యాసం స్వీకరించి, తన పేరును వెన్. గ్యాల్టెన్ సామ్టెన్ గా మార్చుకుంది. బర్ఖా మదన్ ఇప్పుడు పర్వతాలలోని మఠాలలో నివసిస్తుంది.
































