ఇటీవల సోషల్ మీడియాలో భారీ ట్రక్ పై మహా శివలింగం కనిపించింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద శివలింగంగా చెప్పుకుంటున్నారు. 33 అడుగుల పొడవు 210 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న ఈ శివలింగం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? అన్న ప్రశ్నలు చాలామంది మదిలో మెదిలాయి. మరి ఆ శివలింగం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల శివలింగం ఇది. తమిళనాడులోని మహాబలిపురం లో దాదాపు పది సంవత్సరాలపాటు ఇది రూపుదిద్దుకుంది. ఈ శివలింగం ను బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్టించనున్నారు. చాకియా కేసరియా రహదారిపై మహావీర్ మందిర్ సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ఆలయం 1080 అడుగుల పొడవు,540 అడవుల వెడల్పుతో రూపుదిద్దుకుంటుంది. రామాయణంలో ఉండే కొన్ని సన్నివేశాలు ఈ ఆలయం గోడల మీద చూడవచ్చు. ఈ ఆలయంలో 22 మందిరాలు, 18 గోపురాలు, 250 అడుగుల ఎత్తయిన ప్రధాన గోపురం ఉండరు ఉంది. ఇప్పటికే ఇందులో వినాయకుడి ఆలయం, నంది విగ్రహం వంటి కట్టడాలను ఏర్పాటు చేశారు. చివరిగా అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్టించనున్నారు.
విరాట్ రామాయణ ఆలయ నిర్మాణానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి భక్తులు అధికంగా వచ్చేందుకు అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ను మళ్ళించారు. అలాగే భక్తులకు సురక్షితమైన దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ప్రతి కిలోమీటర్ కు ఇంజనీర్ల బృందం సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉందని అంటున్నారు.
మహా శివలింగం బరువు అధికంగా ఉండడంతో 96 చక్రాల హైడ్రాలిక్ వాహనంపై తరలించారు. దాదాపు 20 నుంచి 25 రోజులపాటు ఇది చంపారం జిల్లాకు వెళ్లనుంది. మహాబలిపురం నుంచి చంపారన్ వరకు భక్తులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చంపారం జిల్లాకు చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగంలో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సాధువులు, పండితులు, వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ శివలింగం ప్రతిష్ట సందర్భంగా ఊరేగింపులు, పూజలు ఉండలున్నాయి. శివలింగం వచ్చే మార్గంలో ఆయా నగరాల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ శివలింగం నిర్మాణానికి దాదాపు రూ. మూడు కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.































