చాలా మంది పరాటాలు ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. పరాటాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వేటితో అయినా పరాటాలు చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ పరాటాలు, చికెన్ లేదా మటన్, మసాలా పరాటాలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి.
మనం వాటిల్లో పెట్టే స్టవ్ బట్టి పరాటాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మోస్ట్ ఫేమస్.. ఆలూ పాలక్ పరాటా గురించి తెలుసుకుందాం. ఈ పరాటా అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పరాటా చేయడం కూడా సులవే. కాకపోతే కాస్త ఓపిక కావాలి. మరి ఈ టేస్టీగా ఆలూ పాలక్ పరాటాలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పాలక్ పరాటాలకు కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన బంగాళ దుంపలు, పాలకూర, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లి తరుగు, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, చాట్ మసాలా, ఆమ్ చూర్ పౌడర్, బటర్ లేదా నెయ్యి లేదా నూనె.
ఆలూ పాలక్ పరాటాలు తయారీ విధానం:
ముందుగా బంగాళ దుంపల్ని బాగా కడిగి.. కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉడికా చేతితో మెదిపి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పాలకూర తరుగు బాగా కడిగి తీసుకోవలె. ఇప్పుడు చపాతీ పిండిలో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి ఓ పావు గంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టాలి. ఇందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. ఇది వేడి చేశాక.. వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి రంగు మారేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో బంగాళ దుంపలు, పాలకూర వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత కారం, పసుపు, చాట్ మసాలా, ఆమ్ చూర్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని మళ్లీ కలుపుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ పరాటాల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటి మధ్యలో బంగాళ దుంప మిశ్రమం ఉంచి.. నాలుగు వైపులా చపాతీని మూపేయాలి. ఇప్పుడు మళ్లీ పరాటాల్లా చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన పెనంపై వేయాలి. ఈ పరాటాను నెయ్యి లేదా బటర్‌తో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ పరాటా సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.