కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ.. కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు.

 కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ(SIT investigation) ముగిసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వినియోగించిన నెయ్యి కల్తీ అయిందని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌పై అభ్యంతరాలు రావడంతో సీబీఐ నేతృత్వంలో అధికారులు విచారణ కొనసాగించారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ సాగింది. మొత్తం 24 మందిని నిందితులను గుర్తించారు.


మరో 12 మంది పాత్ర ఉన్నట్లు నిర్దారించారు. బోలె బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు, పామిల్, విపిన్ జైన్‌లు కీలక సూత్రధారులుగా గుర్తించారు. విచారణ ముగియడంతో తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టు(Nellore ACB Court)లో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.