నాటు కోడితో ఇన్ని లాభాలా.. అందుకే ఇంత డిమాండ్.

నాటు కోడిలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నాటు కోడిలో ఉండే పోషకాలు మన కండరాల బలంగా ఉండటానికి తోడ్పడుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. నాటుకోడి మాంసం గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు.


ప్రస్తుత కాలంలో నాన్‌వెజ్ తినడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. రోజు, సందర్భంతో పని లేకుండా మనం నాన్‌వెజ్‌కు అలవాటు పడిపోయం అన్నది నమ్మలేని నిజం. ఏ చిన్న సందర్భమైన ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. పండుగలు, పబ్బాల సమయంలో అసలు చెప్పాల్సిన పనే లేదు. అయితే ఎన్ని నాన్‌వెజ్‌లు ఉన్న చికెన్‌ అనేది ప్రత్యేకం. ఇది అందుబాటు ధరల్లో దొరుకుతోంది. రుచికరంగా ఉంటుంది. అయితే మనం చికెన్ షాపుల్లో నుంచి తెచ్చుకునే బాయిలర్ కోడి కంటే.. నాటుకోడి ఆరోగ్యానికి చాలా మంచిందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ వంటకాలలో నాటుకోడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సహజ వాతావరణంలో పెరిగే ఈ కోడి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. నాటుకోడిలో తక్కువ కొవ్వు కంటెంట్ ఉంటుంది. ఇది బాయిలర్ కోడి కంటే రుచికరంగా ఉండి అధిక పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే బయట మార్కెట్‌లో నాటుకోడికి బాగా డిమాండ్ ఉంటుంది.

నాటు కోడిలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నాటు కోడిలో ఉండే పోషకాలు మన కండరాల బలంగా ఉండటానికి తోడ్పడుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. నాటుకోడి మాంసం గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది మన జీర్ణ ప్రక్రియకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. బాయిలర్ కోడి తో పోల్చుకుంటే నాటుకోడి త్వరగా జీర్ణమవుతుంది.

నాటుకోడి తింటే..

నాటు కోళ్లు నేచురల్‌గా పెరుగుతాయి కాబట్టి ఇవి మన శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. వీటిని తీసుకోవడం ఒక సురక్షితమైన ఆహారపు ఎంపికగా చెప్పవచ్చు. నాటుకోడిలో సహజమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది. రుచిలో, పోషకాలలో నాటుకోడి మాంసానికి మరేదీ పోటీ కాదని చెబుతుంటారు. ఫారంలో తెచ్చే బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచి అమోఘంగా ఉంటుంది.

నాటుకోడి ఎక్కువ ఇష్టపడతారు..

చాలామంది మాంసాహారులు నాటుకోడి మాంసాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరంలో అధిక కొవ్వుతో బాధపడేవారు కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని తగ్గించడానికి నాటు కోళ్లు తింటే మంచిదని వైద్యులు సూచిస్తారు. నాటుకోడి తింటే ఎముకలు బలోపేతం అవుతాయి. ప్రస్తుతం మన సమాజంలో మళ్లీ నాటు కోళ్లపైన జనాల దృష్టి మళ్లింది. ధర ఎక్కువైనప్పటికీ కొనుగోలు చేసుకుని నాటుకోడిని వండుకు తింటున్నారు.

నాటు కోళ్ళకు పెరిగిన డిమాండ్..

అనేక తరాల నుంచి దేశీయ నాటుకోడిలో ఉండే పోషకాలు మన శరీరానికి బలం అనే అభిప్రాయంతో చాలామంది నాటు కోళ్లు తింటున్నారు. ఆరోగ్యంపై చైతన్యం వచ్చిన ఎంతోమంది నాటుకోడి మంచిదని భావించి తినడం వల్ల వీటి డిమాండ్ బాగా పెరిగింది. ధర ఎక్కువైనప్పటికీ చెల్లించి నాటుకోడినే కొనుగోలు చేసుకుని తింటున్నవారు లేకపోలేదు. ఏది ఏమైనా నాటుకోడి మన శరీరానికి కావలసిన సమతుల ఆహారాన్ని అందించి ఆరోగ్యానికి దోహదం చేస్తుందనేది వాస్తవం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.