ఆ గ్రామంలో దీపావళికి వింత సంప్రదాయం.. తమపై ఆవులను నడిపించుకునే భక్తులు.. ఎక్కడంటే..

www.mannamweb.com


మధ్యప్రదేశ్ అజబ్ హై, సబ్సే గజబ్ హై”.. అంటే ఇది మధ్యప్రదేశ్ లో వింత.. అంతేకాదు అన్ని కంటే అద్భుతం అనేది రాష్ట్ర పౌరుల ప్రసిద్ధ నినాదం.. ఇది దీపావళి పండగ సందర్భంగా ఉజ్జయిని జిల్లాలో కనుల ముందు దర్శనం ఇస్తుంది.

అక్కడ దీపావళి సందర్భంగా భక్తులు ఆవులను తొక్కించుకుంటారు. జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలోని బద్‌నగర్ తహసీల్‌లోని భిద్వాడ్ గ్రామంలో ఈ విశిష్ట సంప్రదాయం ఉంటుంది.

దీపావళి పండుగ మర్నాడు ఉదయం ఇక్కడ ఒక మతపరమైన ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండగ తర్వాత రోజు ఉదయం గ్రామంలో గోవులకు పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు నేలపై పాడుకుంటారు. ఇలా పడుకున్న భక్తులపైకి ఆవులను వదులుతారు. గోవులలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని ప్రజల నమ్మకం. ఇలా తమ ఆవులపై నడిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

అంతేకాదు ఈ సంప్రదాయంలో పాల్గొనేవారు మరొక పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీపావళి పండగ సందర్భంగా ఐదు రోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. దీపావళికి ఒక రోజు ముందు.. తమ గ్రామ దేవత ఆలయంలో రాత్రి సమయంలో బస చేస్తారు. అక్కడ భజనలు, కీర్తనలు కూడా చేస్తారు.

దీపావళి పండగ తర్వాత రోజు ఉదయం పూజ నిర్వహిస్తారు. అప్పుడు ప్రజలు డప్పులతో గ్రామం చుట్టూ తిరుగుతారు. ఈ సమయంలో గ్రామంలోని ఆవులన్నింటినీ ఒకే చోటికి తీసుకువస్తారు. ప్రజలు నేలపై పడుకుంటారు. అవి తమని తొక్కుకుని వెళ్ళేలా చేస్తారు.

ఆవులు తమని తొక్కుతూ వెళ్ళిన తర్వాత భక్తులు లేచి నిలబడి డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇలా గ్రామమంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ పండగను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తారు. అయితే ఇలా ఆవులు తొక్కిన సమయంలో ఇప్పటి వరకూ ఒక్కరూ గాయపడలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)