ఈ 5 కూరగాయలు ఫ్యాటీ లివర్ కు ఒక వరం.. కేవలం 3 నెలల్లోనే రిలీఫ్

కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు ప్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. ప్రారంభంలో దీని లక్షణాలు తేలికాగా ఉంటాయి. అలసట, కడుపులో బరువు లేదా బలహీనత వంటివి.


అందుకనే సాధారణంగా ప్రజలు దీని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు. అయితే ఫ్యాటీ లివర్ సమస్య పెరిగిన తర్వాత ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఈ ప్యాటీ లివర్ సమస్యకు మొదట్లోనే ఈ 5 కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. కేవలం 3 నెలల్లోనే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

పాలకూర: పాలకూరలో విటమిన్ ఇ, సి , ఫైబర్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతినకుండా, వాపు నుంచి రక్షిస్తాయి. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. దీనిని తినడం వల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

బ్రోకలీ: ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంటే తినే ఆహారంలో బ్రోకలీని తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో ఉండే గ్లూకోసినోలేట్లు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో, కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు కాలేయ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

బ్రస్సెల్స్ మొలకలు : బ్రస్సెల్స్ మొలకలలో ఉండే ఇండోల్ కాలేయంలో కొవ్వు నిల్వ ఉండకుండా నిరోధిస్తుంది. నిర్విషీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనితో పాటు దీనిని తినడం వల్ల కాలేయ ఎంజైమ్‌లు సమతుల్యంగా ఉంటాయి. వీటిని రోజూ తినే ఆహరంలో చేర్చుకుంటే కొవ్వు కాలేయం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

కాలే: దీనిని లీఫ్ క్యాబేజీ అని కూడా అంటారు. యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న కాలే కొవ్వు కాలేయానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల కాలేయ ఎంజైమ్‌లు సాధారణంగా ఉంటాయి. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే నైట్రేట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. కాలేయ వాపును తగ్గిస్తాయి.

క్యారెట్: క్యారెట్ లోని బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారి కాలేయ కణాలను మరమ్మతు చేస్తుంది. క్యారెట్ లో రక్తంలో చక్కెరను నియంత్రించే ఫైబర్ ఉంటుంది. క్యారెట్ తినడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

ప్రారంభం దశలోనే ప్యాటీ లివర్ ని గుర్తించినా.. లేక కాలేయం ఆరోగ్యం కోసం పాలకూర, బ్రస్సెల్స్ మొలకలు, కాలే, క్యారెట్లు, బ్రోకలీని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. కేవలం 3 నెలల్లో కొవ్వు కాలేయం తగ్గుతుంది. సరైన జీవనశైలితో పాటు సరైన ఆహారంతో కొవ్వు కాలేయాన్ని తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.