కొత్త సంవత్సరం రాకముందే మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ .10,000 కంటే తక్కువ ధరకే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌ని మీరు ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు! ఈ రేంజ్లో ఉన్న బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రియల్మీ సీ71- ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ తర్వాత రూ .7,318 ధరకు ఈ రియల్మీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ పరికరం 6300 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, యూనిసాక్ టీ7250 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది.
వివో వై19ఈ 5జీ – వివో స్మార్ట్‌ఫోన్ యూనిసాక్ టీ 7225 ప్రాసెసర్‌తో వస్తుంది. 64 జీబీ స్టోరేజ్ ఇందులో భాగం. ఇందులో 5500 ఎంఏహెచ్ కెమెరా, 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.
ఇన్ఫీనిక్స్ హాట్ 60ఐ 5జీ – ఆగస్టులో లాంచ్ అయిన ఇన్ఫీనిక్స్ పరికరంలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.


































