ప్రతి విషయం గురించి విదేశాలపై ఆధార పడటంతో వీక్ అయిపోతున్నామని స్వదేశీ వస్తువులు, టెక్నాలజీని మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం మన ఫోన్ ఉన్న యాప్లో 90 శాతం విదేశాలు డెవలప్ చేసినవే.
ఫేస్ బుక్, వాట్సాప్, అమెజాన్, ఇలా ప్రతి యాప్ కూడా విదేశాల నుంచి దిగుమతి అయ్యిందే. మరి ప్రధానమంత్రి సూచిన మేరకు వస్తువులను వాడుతున్న మనం యాప్ల విషయంలో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్టు అయితే ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు.
భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ రోజుకో షాక్ ఇస్తున్నారు. మొదట్లో సుంకాల పేరుతో భారత్ ఎగుమతులపై దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారు. తర్వాత H1B వీసాల ఫీజులను దాదాపు కోటి రూపాయలకు పెంచారు. ఇప్పుడు ఔషధాలపై కూడా వంద శాతం సుంకాలను విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇలా ఏదో వంకతో భారత్ను కుంగదీయాలని లొంగదీసుకోవాలని చూస్తున్నారు. అందుకే దానికి విరుగుడుగా భారత్ ప్రధానమంత్రి స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా టెక్నాలజీ విషయంలో కూడా మార్పు రావాలని సూచించారు.
ప్రస్తుతం రోజువారీ దైనందిన జీవితంలో భాగమైన విదేశీ యాప్లకు ప్రత్యామ్నాయలను చూస్తే చాలా యాప్లు మనకు కనిపిస్తాయి.
వాట్సాప్- అరట్టై
ఇప్పుడు రోజూ వారి జీవితంలో వాట్సాప్ భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ ఓపెన్ చేయనిదే సమయం గడవదు. అలాంటి వాట్సాప్కు ప్రత్యామ్నాయం మన స్వదేశీ యాప్ ఉంది. అదే జోహో కార్పొరేషన్ డెవలప్ చేసిన అరట్టై.మెసేజింగ్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, గ్రూప్ చాట్, మల్టీమీడియా షేరింగ్కు అనుకూలంగా ఉన్నట్టు ఆ సంస్థ పేర్కొంది.
జీమెయిల్– జోహో మెయిల్
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమైంది మెయిల్. కానీ ఇప్పటి వరకు గూగుల్ డెవలప్ చేసిన జీమెయిల్ను అందరూ వాడుతుంటారు. స్వదేశీ ఉద్యమం ఊపందుకున్న వేళ దీనికి ప్రత్యామ్నాయంగా జోహో కంపెనీ డెవలప్ చేసిన మెయిల్ ఒకటి ఉంది. క్లీన్ ఇంటర్ ఫేస్, సర్వీస్ ఇమెయిల్ మేనేజ్ మెంట్ టూల్స్ , జోహో డెవలప్ చేసిన యాప్ల సూట్తో అనుసంధానం చేసి ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్- మ్యాప్ల్స్
నిత్యం రోజూ వారీగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్కు ప్రత్యామ్నాయం ఉంది. మ్యాప్ మై ఇండియా రూపొందించిన మ్యాపల్స్ గూగుల్ కంటే మెరుగ్గా పని చేస్తోంది. భారతదేశ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా యూజ్ అవుతుంది. రియల్-టైమ్ ట్రాఫిక్ అప్డేట్లు , కచ్చితమైన ప్రదేశాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. గ్రామాల్లో కూడా చాలా కచ్చితంగా పని చేస్తోంది.
గూగుల్ డాక్స్ – జోహో రైటర్
జోహా సంస్థ నుంచి వచ్చిన మరో అద్భుతమైన యాప్ రైటర్. ఇది గూగుల్ డాక్స్కు ప్రత్యామ్నాయంగా వర్క్ చేస్తుంది. క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ లేటెస్ట్ టెక్నాలజీతో పని చేస్తోంది. స్వదేశీయంగా తయారయ్యే యాప్స్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ – జోహో షీట్
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కు ప్రత్యామ్నాయంగా జోహో రూపొందించిందే జోహో షీట్ . ఈ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ సహజమైన డేటా విశ్లేషణ, చార్టింగ్ టూల్స్, రియల్-టైమ్ సహకారాన్ని అందిస్తోంది. వ్యక్తిగతంగా, వ్యాపార, ఆఫీస్ లలో వాడుకోవడానికి ఇదో మంచి స్వదేశీయాప్.
మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఆల్టర్నేటివ్
చాలా మంది కార్పొరేట్ కార్యాలయాల్లో, ప్రభుత్వం కార్యాలయాల్లో వాడే ముఖ్యమైన యాప్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్. దీనికి ప్రత్యామ్నాయంగా జోహో సంస్థషో అనేది రూపొందించింది. మైక్రోసాఫ్ట్ మాదిరిగానే ఇది కూడా ఆకర్షణీయమైన స్లైడ్ షోలతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్య కాలంలో క్యాబినెట్ బ్రీఫింగ్లో దీంతోనే పవర్ పాయింట్ ప్రజెంటేన్ ఇచ్చారు.
అడోబ్ సైన్ పోటీగా జోహో సైన్
ఎక్కువ మంది యూజ్ చేసే యాప్లో ఒకటి అడోబ్ సైన్. దీనికి ప్రత్యామ్నాయంగా జోహో సైన్ వాడుకోవచ్చు. డిజిటల్ సంతకాలు, డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి వర్క్ఫ్లో ఇంటిగ్రేషన్ కోసం దీన్ని రూపొందించారు.
అమెజాన్ – ఫ్లిప్కార్ట్
ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఇందులో ఎక్కువ మంది వస్తువులను అమెజాన్ లాంటి సైట్లో కొంటున్నారు. ఇది విదేశీ సంస్థ రూపొందించిన యాప్ దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే ఫ్లిప్కార్ట్. అమెజాన్కు గట్టి పోటీ ఇస్తున్న యాప్.
































