ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు కు చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎంసెట్లో మీరు ఉత్తీర్ణులై హైదరాబాద్ నగరంలోని టాప్ టెన్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు సాధించాలి అంటే ఎంసెట్లో ఎంత ర్యాంకు తెచ్చుకోవాలో తెలుసుకుందాం.
గత సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఏ ర్యాంకు వచ్చినట్లయితే సీఎస్ఈలో సీటు లభించిందో కటాఫ్ ర్యాంకు గురించి తెలుసుకుందాం. తద్వారా ఆయా కాలేజీల్లో మీకు సీటు లభిస్తుందా లేదా తెలుసుకుందాం.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (OUCE)
హైదరాబాదులోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ పరంగాను, క్యాంపస్ రిక్రూట్మెంట్ పరంగాను మంచి పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు రావాలంటే 1000 లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కూకట్పల్లి, హైదరాబాద్ (JNTU-H)
జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీ దేశంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ కాలేజీలో సీటు రావాలంటే జనరల్ కేటగిరీలో 1500 లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట (CBIT)
తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సిబిఐటి కూడా ఒకటి. ఈ కాలేజీలో జనరల్ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో సీటు రావాలంటే ఎంసెట్లో 2500 ర్యాంకు లోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇబ్రహీంబాగ్ (VASV)
తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి. ఈ కాలేజీలో జనరల్ కేటగిరి లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో సీటు రావాలంటే ఎంసెట్లో 3000 ర్యాంకు లోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (VJEC)
హైదరాబాదులోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటేనా ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు రావాలంటే ఎంసెట్లో 3500 ర్యాంకు లోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (GRRR)
నగరంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైనటువంటి ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు రావాలంటే ఎంసెట్లో 4000 ర్యాంకులోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
G. నారాయణమ్మ Institute of Technology and Science
నగరంలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అయినటువంటి ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు తెచ్చుకోవాలంటే ఎంసెట్లో 4500 ర్యాంకు లోపు తెచ్చుకోవాల్సి ఉంటుంది
మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల (MATR)
నగరంలోని ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంసెట్లో 6000 లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
మహాత్మ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (MGIT)
నగరంలోని ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో జనరల్ కేటగిరిలో ఎంసెట్లో 5000 లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్ (IARE)
నగరంలోని ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు తెచ్చుకోవాలంటే ఎంసెట్లో 6500లోపు ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది.
ఈ వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న పబ్లిక్ సమాచారం మేరకు పొందుపరచడం జరిగింది. గత సంవత్సరాల TS EAMCET కౌన్సిలింగ్ కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఈ సమాచారంలో రూపొందించబడినవి. ప్రతి సంవత్సరం కటాఫ్ ర్యాంకుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లేదా కౌన్సెలింగ్ సమయంలో ప్రకటించే తాజా సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

































