పండుగల వేళ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్‌-10 చీరలు ఇవే

ఈ చీరల ధర ప్రారంభమే రూ.లక్ష ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు ఉన్న చీరలు ఉన్నాయి. ఒక చీర అయితే ధరల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను నమోదు చేసింది.


వివాహ్ పట్టు నుంచి బనారసి, కాంజీవరం, పైథాని వంటి కాలాతీత వారసత్వ చేనేత వరకు ప్రపంచంలోని ఖరీదైన చీరలు కళాత్మక నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వం, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాయి. రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు ధర ఈ చీరలు విలాసవంత వస్తువుగా మారింది. శతాబ్దాల సంప్రదాయం, అసాధారణమైన హస్తకళను కలిగి ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 చీరల వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహ పట్టు చీర
తమిళనాడులోని చెన్నై సిల్క్స్ రూపొందించిన వివాహ్ పట్టుచీర అత్యంత ధర కలిగినవి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా వివాహా పట్టుచీర గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఈ చీర విలువ దాదాపు రూ.3.93 కోట్లు. ఈ చీరలో మేలిమి బంగారం, వెండితోపాటు ప్లాటినం వినియోగించారు. ఈ చీరలో ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన చిత్రాలు కనిపిస్తాయి. వజ్రాలు, కెంపులు, పచ్చలు ఈ చీరలో ఉంటాయి. ఈ చీర పూర్తి కావడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది.

బనారస్‌ పట్టుచీర
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన చీరలను బనారస్‌ చీరలు అంటాయి. ఈ చీరల ధరలు ప్రారంభమే రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. రూ.10 లక్షల వరకు బనారస్‌ చీరల ధరలు ఉంటాయి. చీరల తయారీలో మేలిమి బంగారంతోపాటు వెండి జరీని ఉపయోగిస్తాయి. ఈ చీరలు తయారుచేయడానికి కొన్ని నెలలు పడుతుంది.

కాంజీవరం పట్టు చీర
తమిళనాడులోని కాంచీవరం పట్టు ‘పట్టు రాణి’గా గుర్తింపు పొందింది. అత్యున్నత నాణ్యత, మన్నిక ఉన్న చీరలు రూ.2 లక్షల నుంచి ప్రారంభమై రూ.7 లక్షల వరకు ధరలు ఉంటాయి. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో బంగారం, వెండి జరీతో నేస్తారు. చీర బాడీ, అంచు, పల్లులను కలపడానికి ముందు విడిగా తయారు చేస్తారు. ఈ చీరలు భారతదేశ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి.

పైథాని పట్టుచీర
మహారాష్ట్రలో గుర్తింపు పొందిన పైథానీ పట్టు చీర శాతవాహన రాజవంశ కాలం నుంచి కనిపిస్తోంది. చీర పరిమాణం, డిజైన్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఈ చీరల ధరలు ఉంటాయి. చక్కటి పట్టు, ప్రామాణికమైన జరీతో తయారుచేసిన ఈ చీరల్లో నెమళ్లు, కమలం పువ్వులు ఉంటాయి. ఒకప్పుడు రాజ కుటుంబాలు, ప్రభువులు ధరించేవారు. ఇప్పుడు సంపన్నులకు ఇష్టమైన చీరల్లో ఒకటి.

పటోలా చీర
గుజరాత్‌లోని పటాన్ నుంచి వస్తున్న పటోలా చీరలు డబుల్ ఇకత్ ఉండడం విశేషం. వీటిని పూర్తి చేయడానికి నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. పటోలా చీరల ధరలు రూ.2 లక్షల నుంచి ప్రారంభమై రూ.7 లక్షల వరకు ఉంటాయి. మొదట్లో రాజకుటుంబీకులు ధరించేవారు. ఇప్పుడు సంపన్నులు.. విలాసవంతమైన వస్తువుల్లో ఒకటిగా పటోలా చీరలు మారాయి.

మైసూర్ పట్టుచీర
కర్ణాటకలోని ప్రసిద్ధ మైసూర్‌ ప్రాంతానికి చెందిన ఈ చీరలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నాయి. మహిళలకు ఈ చీరలు ఎంతో ఇష్టం. దక్షిణ భారత వివాహాల్లో ప్రధానంగా ఈ చీరలు కనిపిస్తుంటాయి. బంగారు జరీ అంచులతో స్వచ్ఛమైన పట్టుతో తయారుచేసిన ఈ చీరలు రూ.లక్ష నుంచి ధర ప్రారంభమవుతుంది. రూ.3 లక్షల వరకు ఈ చీరల ధరలు ఉంటాయి. వడియార్ రాజవంశం ద్వారా ఈ చీరలకు ప్రాచుర్యం లభించింది.

జమ్దానీ చీర
బెంగాల్‌లో తయారయ్యే జమ్దానీ చీరలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వీటి ధరలు రూ.80,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటాయి. పట్టు, బంగారు ధారాలతో ఈ చీరలను తయారుచేస్తాయి. మొఘల్ కాలం దర్పం ఈ చీరల్లో ఉంటుంది. జమ్దానీ చీరలు సాంస్కృతిక వారసత్వానికి గౌరవంగా నిలుస్తున్నాయి.

బాలుచారి పట్టు చీర
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బలుచారి చీరలు పౌరాణిక, ఇతిహాస కథలను వర్ణించేలా ఉంటాయి. అంచులు, పల్లుతో కూడిన ఈ చీరలు మహిళలకు అదనపు అందాన్ని చేకూరుస్తాయి. ఈ చీరల ధరలు రూ.50,000 నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటాయి. ఈ చీరలు తయారుచేయడానికి కొన్ని వారాలు పడుతాయి.

చందేరి సిల్క్ చీర
మధ్యప్రదేశ్‌కు చెందిన చందేరి పట్టు చీరలు తేలికగా.. పారదర్శకంగా. ఎంతో అందంగా ఉండే చందేరి పట్టు చీరలు రూ.40,000 నుంచి రూ.1 లక్ష వరకు ధరలు ఉంటాయి. పండుగ, వివాహ సందర్భాలలో ధరించే వస్త్రాలలో చందేరి చీరలు ధరిస్తే మరింత వైభవంగా ఉంటుంది. భారతదేశం అంతటా అత్యంత ప్రజాదరణ పొందిన చీరల్లో ఇది ఒకటి.

టస్సార్ పట్టు చీర
బీహార్, జార్ఖండ్‌లో తయారయ్యే టస్సర్‌ పట్టు చీర చాలా అందంగా ఉంటుంది. సహజమైన బంగారు రంగు, సరికొత్త డిజైన్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. డిజైన్ ఆధారంగా వాటి ధరలు రూ.30 వేల నుంచి రూ.80,000 వరకు ఉంటాయి. పట్టు పురుగుల నుంచి తీసిన పట్టును చేతితో నేస్తారు. టస్సార్ చీరలు అరుదైనత, సహజ సౌందర్యం కలిగినవి. ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే బాగుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.