ప్రతి శుక్రవారంలాగే ఈవారం కూడా తెలుగు సహా వివిధ భాషల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి రానున్న ఆ సరికొత్త కంటెంట్ ఏంటో చూడండి.
మరో లాగ్ వీకెండ్ రాబోతోంది. ఈసారి శని, ఆదివారాలతోపాటు రిపబ్లిక్ డే రూపంలో సోమవారం (జనవరి 26) కూడా హాలీడే ఉండనుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కూడా వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శుక్రవారం (జనవరి 23, 2026) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ధనుష్, కిచ్చా సుదీప్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు శోభిత ధూళిపాళ నటించిన తెలుగు థ్రిల్లర్ కూడా లిస్టులో ఉంది.
చీకటిలో – అమెజాన్ ప్రైమ్ వీడియో
శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో.. సంధ్య (శోభిత) ఒక క్రిమినాలజీ గ్రాడ్యుయేట్, ట్రూ-క్రైమ్ పాడ్‌కాస్టర్. తన ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ఒక సీరియల్ కిల్లర్ గుట్టును ఎలా రట్టు చేసిందన్నదే ఈ సినిమా కథ.
తేరే ఇష్క్ మే – నెట్‌ఫ్లిక్స్
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ హిందీ రొమాంటిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడూ ఆవేశంతో రగిలిపోయే స్టూడెంట్ లీడర్ శంకర్ (ధనుష్).. రీసెర్చర్ ముక్తి (కృతి) ప్రేమలో పడతాడు. ఆమె అతన్ని వదిలేసి వెళ్లాక, శంకర్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మారుతాడు. ఏడేళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఎలా కలిశారు? వారి మధ్య ప్రేమ, పగ ఎలా సాగాయన్నది ఆసక్తికరం. ఈ సినిమా శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
45 – జీ5 ఓటీటీ
కన్నడ స్టార్స్ శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన మల్టీస్టారర్ ఇది. గ్యాంగ్‌స్టర్ కుక్కను చంపిన పాపానికి ఒక వ్యక్తికి (రాజ్ బి. శెట్టి) పశ్చాత్తాపం కోసం 45 రోజుల గడువు లభిస్తుంది. గరుడ పురాణంలోని తాత్విక అంశాలతో ముడిపడిన ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. జీ5 ఓటీటీలో చూడొచ్చు.
మార్క్ – జియోహాట్‌స్టార్
కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్. డిస్మిస్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్.. అవినీతిని, ప్రమాదకరమైన నేర సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఎలా తిరిగి వచ్చాడన్నదే ఈ సినిమా. జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనుంది.
స్పేస్ జెన్: చంద్రయాన్ – జియోహాట్‌స్టార్
ఇస్రో (ISRO) ప్రయాణాన్ని కళ్లకు కట్టే వెబ్ సిరీస్ ఇది. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి చంద్రయాన్-3 విజయం వరకు శాస్త్రవేత్తల కృషిని ఇందులో చూపించారు. నకుల్ మెహతా, శ్రియ శరణ్, ప్రకాష్ బెలవాడి ఇందులో నటించారు. టీవీఎఫ్ ఈ సిరీస్ ను తెరకెక్కించడం విశేషం.
సిరాయ్ – జీ5 ఓటీటీ
విక్రమ్ ప్రభు హెడ్ కానిస్టేబుల్‌గా నటించిన తమిళ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా. ఒక అమాయకుడైన ఖైదీని కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఎదురయ్యే నిజాలు, వ్యవస్థలోని లోపాలను ఇందులో చూపించారు. జీ5 ఓటీటీలోకి రానుంది.
మస్తీ 4 – జీ5 ఓటీటీ
రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని కాంబినేషన్లో వచ్చిన కామెడీ ఫ్రాంచైజీలోని నాలుగో సినిమా ఇది. ఈసారి “రివర్స్ మస్తీ” అనే కాన్సెప్ట్‌తో భర్తలపై భార్యల ఆధిపత్యం, దానివల్ల వచ్చే గందరగోళం నవ్వులు పూయిస్తుంది. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది.




































