Diabetes Control: షుగర్ లెవల్స్‌ని తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి!

ప్రస్తుత కాలంలో అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 11 మందిలో ఒకరు మధుమేహంతో బాధ పడుతూ ఉంటున్నారు.


షుగర్ అదుపులో ఉంచకపోతే.. శరీరంలోని అన్ని భాగాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో మారిన ఆహార విధానాలు, లైఫ్ స్టైల్ మారడం, ఒత్తిడి వల్ల ఈ డయాబెటీస్ తీవ్రంగా విజృంభిస్తోంది. షుగర్‌ని తగ్గించేందుకు అనేక రకాల ఆహారపు అలవాట్లను, చిట్కాలను తెలుసుకున్నాం. షుగర్‌ని తగ్గించుకోవడంలో తమలపాకు కూడా చక్కగా ఉపయోగ పడుతుంది. తమలపాకులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. తమలపాకు తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ట్రిక్ సమస్య:

ప్రస్తుత కాలంలో అందరూ ఎదుర్కునే సమస్యల్లో గ్యాస్ట్రిక్ కూడా ఒకటి. జీర్ణ క్రియ సమస్యల వల్ల ఇది వస్తుంది. అయితే తమలపాకులను తరచూ తీకుంటూ ఉంటే గ్యాస్ట్రిక్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మూత్ర సమస్యలు కంట్రోల్:

తమలపాకులు తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. తమలపాకులను గ్రైండ్ చేసి.. దాని నుండి రసాన్ని తీసి.. అందులో నీటిని కలపాలి. ఇలా పల్చగా ఉండే తమల పాకుల రసాన్ని తాగడం వల్ల మూత్ర సమస్యల నుంచి త్వరిత గతిన ఉపశమనం పొందుతారు. ఈ రసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే మూత్ర సమస్యల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

షుగర్ స్థాయిలు కంట్రోల్:

బ్లడ్ షుగర్‌తో బాధ పడుతున్న వారు తమల పాకులను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి. తమలపాకులను తరచుగా తీసుకుంటే.. ఖచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి షుగర్ వ్యాధిని నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.

జలుబు – దగ్గు తగ్గుతాయి:

తమలపాకులను తరచుగా తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. తమలపాకుపై ఆవ నూనె రాసి.. జలుబు, దగ్గుతూ బాధ పడుతున్న వ్యక్తి ఛాతీపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయట పడతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.