వీరు పొరపాటున కూడా కాపర్ బాటిల్స్‌లో వాటర్ తాగొద్దు.. అస్సలు మంచిదా కాదు

కాపర్ బాటిల్స్‌లో ఎక్కువ సేపు నీటిని నిల్వ చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటర్ ఎవరు అతిగా తాగకూడదో తెలుసుకుందాం.


ఈ మధ్య కాలంలో కాపర్ బాటిల్స్ (Copper Bottles) వాడకం పెరిగిపోయింది. ఎర్ర రక్త కణాల నిర్మాణం, న్యూరోసెల్స్ మేనేజ్‌మెంట్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు వంటి కీలక శారీరక విధులకు రాగి అవసరం. యాంటీ మైక్రోబయల్ గుణాలతో పాటు కాపర్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రాగి బిందెలు, సీసాల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే, ఈ మూలకం నీటిలోకి అబ్జార్బ్ అవుతుంది. అందుకే ఈ వాటర్ తాగడం మంచిదంటారు. కాపర్ బాటిల్స్‌లో ఎక్కువ సేపు నీటిని నిల్వ చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటర్ ఎవరు అతిగా తాగకూడదో తెలుసుకుందాం.

కాపర్ అలర్జీ ఉన్న వ్యక్తులు ఇతర లోహాలతో పోలిస్తే రాగిని సాధారణంగా బలహీనమైన సెన్సిటైజర్‌గా పరిగణిస్తారు. అయితే, కాపర్ అలర్జీ లేదా కాపర్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులకు ఇది మరింత సమస్యగా మారుతుంది. రాగి తగిలిన చోట ఎరుపుగా మారడం, దురద, దద్దుర్లు వంటివి కనిపించి అలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్ (ACD)కి దారితీస్తాయి. దీంతో పాటు కాంటాక్ట్ యూర్టికేరియా, బాడీ మొత్తం అలర్జీ రియాక్షన్స్ కనిపిస్తాయి.

కిడ్నీ డిసార్డర్ బాధితులు శరీరంలో అధిక కాపర్ లెవల్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాప్తి మధ్య బలమైన సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, కిడ్నీల పనితీరు బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో అదనంగా వచ్చిన రాగిని ఫిల్టర్ చేసే సామర్థ్యం తగ్గిపోయి శరీరంలో పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో, కాపర్ టాక్సిసిటీకి (Copper Toxicity) దారితీసి వికారం, వాంతులు, కడుపు నొప్పి, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి.

పిల్లలు, శిశువులు అధిక కాపర్ లెవల్స్ ఉన్న నీటిని తాగిన పిల్లల్లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్స్ రేటు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలోని పూర్తిగా అభివృద్ధి చెందని కాలేయం, కిడ్నీలు ఈ రాగిని ఎఫెక్టివ్‌గా ఫిల్టర్ చేయలేవు. దీంతో, రాగి పాత్రలలో నిల్వ చేసిన ఆహారాన్ని తిన్నా, వాటర్ తాగినా హాని కలుగుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. 6 నెలల్లోపు పిల్లలకు 200 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ కాపర్ ఇవ్వకూడదు.

విల్సన్ వ్యాధి ఉన్నవారు   అరుదైన జన్యుపరమైన డిసార్డర్ అయిన విల్సన్ వ్యాధి.. రాగిని సరిగా ఫిల్టర్ చేయకపోవడం వల్ల వస్తుంది. దీని ప్రభావంతో కాలేయం, మెదడు, కిడ్నీల్లో రాగి పేరుకుపోయి లివర్ ఫెయిల్యూర్, న్యూరో లాస్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని అతిగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది.

కాపర్ టాక్సిసిటీ లక్షణాలు కాపర్ టాక్సిసిటీ లక్షణాలలో వికారం, వాంతులు, కడుుప నొప్పి, విరేచనాలు కలుగుతాయి. కొంతమంది వ్యక్తులు తలనొప్పి, తలతిరగడం, సాధారణ అనారోగ్యం వంటి నాడీ సంబంధిత ప్రభావాలను కూడా అనుభవిస్తారు. రాగి పేరుకుపోవడం దీర్ఘకాలికంగా కొనసాగితే తీవ్రమైన లివర్, కిడ్నీలు ప్రభావితమై అవయవ నష్టానికి కారణమవుతుంది.

ఇవి పాటిస్తే బెటర్ సేఫ్టీ పద్ధతులను పాటిస్తే కాపర్ బాటిల్స్ నుంచి ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి, వాటి ద్వారా ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా, కాపర్ బాటిల్స్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసిన నీటిని తాగకూడదు. రాత్రిపూట పడుకునే ముందు వాటర్ పోసి ఉదయం లేచాక తాగితే బెనిఫిట్ కలుగుతుంది.

వాటర్ స్టోరేజ్ 6 నుంచి 8 గంటల మధ్య ఉంటే ఆరోగ్యకరం. దీంతో పాటు బాటిల్‌ను రెగ్యులర్‌గా లైట్ డిటర్జెంట్, వాటర్‌తో క్లీన్ చేయాలి. క్లీనింగ్‌కి హార్డ్ కెమికల్స్ వాడకూడదు. దీంతో పాటు, కాపర్ బాటిల్స్‌లో నిమ్మరసం, వెనిగర్ లేదా ఇతర యాసిడ్ లిక్విడ్స్‌ నిల్వ చేస్తే అవి కాపర్ లీచింగ్‌ని పెంచి అనారోగ్యానికి కారణం అవుతాయి. చివరగా, బాటిల్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. దెబ్బతిన్న, తుప్పు పట్టిన, గీతలు పడిన వాటిని వాడకపోవడమే మంచిది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.