మీ జీవితాన్ని మార్చే కథ ఇదీ

కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ కలగలిపిందే జీవితం. కానీ చాలామంది మనుషులు కేవలం కష్టాలు మాత్రమే చూస్తుంటారు. సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులను పెద్దగా పట్టించుకోరు.. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం తమకు కష్టం వచ్చిందని బాధపడుతూ ఇతరులకు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు రెండు ఉంటాయి. ఈ రెండింటిని సమానంగా స్వీకరించి సంతోషాలను పొందుతూ కష్టాల నుంచి బయటపడే మార్గం వెతికిన వారే లక్ష్యాన్ని చేరుకొని ఆనందంగా జీవిస్తారు. అంటే కేవలం కష్టాలను మాత్రమే కాకుండా మనం చేరే గమ్యాన్ని మాత్రమే చూడాలన్న నీతి కథ ఈ చెట్టు ద్వారా తెలుస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే?


ఒక చిన్న విత్తనం ఒక దగ్గర పడి ఉంటుంది. దీన్ని చూసినా కొన్ని పక్షులు తినడానికి ముందుకు వస్తాయి. కానీ ఆ విత్తనం భూమి లోకి వెళ్లి మొక్కగా మారుతుంది కదా అని ఆలోచిస్తాయి. ఆ తర్వాత దానిని ఉపయోగించుకోవచ్చు అని భావిస్తాయి. అలాగే అటువైపు కొన్ని పశువులు వస్తాయి. దీనిని చూసి తిందామని అనుకుంటాయి. కానీ కొంచెం పెద్ద పెరిగిన తర్వాత తిందాంలే అని అనుకుంటాయి. అలాగే ఇంకొంచెం పెద్ద పెరిగిన తర్వాత.. కొంతమంది మనసులు అటువైపు వస్తారు.. చిన్నగా ఉన్న చెట్టును చూసి కొడతామని అనుకుంటారు. కానీ పెద్ద పెరిగిన తర్వాత ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించి వెళ్తారు. ఇలా ఎందరో ఆ చెట్టును ధ్వంసం చేద్దామని అనుకుంటారు. అలా చేద్దామని వారికి ఆలోచన వచ్చినప్పుడు ఆ చెట్టు ఎలాంటి ప్రతిస్పందన లేకుండా మౌనంగా ఎదుగుతుంది. అలా మొత్తంగా పెద్ద వృక్షంగా మారుతుంది.

వృక్షంగా మారిన తర్వాత దీనిపై పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. పశువులు నీడ కోసం వస్తున్నాయి. ఎంతోమంది మనుషులకు ఈ చెట్టు ద్వారా ఆక్సిజన్ అందుతుంది. అంటే ఒక చెట్టు ఎంతోమంది జీవరాశులకు ఉపయోగంగా మారిపోయింది.

మనుషుల జీవితం కూడా అలాగే ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఎదుగుతున్న సమయంలో ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కొందరు మనం వేసే అడుగులకు అటు తలుగుతూ ఉంటారు. అయినా కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే చేయాలి. ఎవరో అన్నారు.. ఏదో చేస్తారు.. అన్న మనసులో ఆలోచనలు లేకుండా ఎదిగే వరకు ఒదిగి ఉండాలి. అందుకే పెద్దలు అన్నారు మౌనంగానే ఎదగాలని మొక్క నీకు చెబుతుంది అని.. ఒక చెట్టుకు ఉన్న ఓపిక మనిషికి ఉంటే కచ్చితంగా జీవితంలో సక్సెస్ సాధించడం పెద్ద విషయం కాదని కొందరు మేధావులు అంటూ ఉంటారు. అయితే నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే హైరానా పడిపోతున్న వారు కనిపిస్తున్నారు. ఇలాంటివారు ఈ స్టోరీ తెలుసుకొని వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.