అద్దెకు బంగారం? ఇప్పుడు ఇదే ఆదాయ మార్గం

బంగారం లాకర్‌లో పెట్టి అద్దె కట్టుతున్నారా?… ఇప్పుడు ఆదాయం పొందండి!


మీరు మీ ఇంట్లో వృథాగా పడి ఉన్న బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టి అధిక అద్దె చెల్లిస్తున్నారా?

ఆ ఖర్చు గురించి బాధపడేవారికి శుభవార్త! మీ బంగారాన్ని అద్దెకు ఇచ్చి లేదా డిపాజిట్ చేసి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. బంగారాన్ని కేవలం సంపదగా దాచుకోవడమే కాకుండా, దాని ద్వారా నిరంతర ఆదాయం పొందే అవకాశం లీజింగ్/గోల్డ్ మోనిటైజేషన్ పథకాల ద్వారా లభిస్తోంది. స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టినప్పుడు అద్దె వస్తున్నట్లే, ఇప్పుడు మీ పసిడిపై కూడా ప్రతిఫలం పొందవచ్చు.

పసిడి లీజింగ్ (ప్రైవేటు): అధిక వడ్డీ, అధిక రిస్క్… నగలు, బిస్కెట్లను ఆభరణాల వ్యాపారులకు, రిఫైనర్లకు అద్దెకు ఇవ్వొచ్చు. వీరు రోజువారీ కార్యకలాపాల కోసం తక్కువ వడ్డీకి పసిడిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

వడ్డీ రేట్లు: ప్రైవేటు సంస్థలు సాధారణంగా 2% నుంచి 4% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు పసిడి విలువపై నూటికి 50 పైసల చొప్పున కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రక్రియ: మీరు ఆభరణాలు ఇస్తే, వాటిని కరిగించి 999 స్వచ్ఛతకు తెచ్చి బరువును నిర్ధారిస్తారు. గడువు ముగిశాక అదే స్వచ్ఛత గల బంగారాన్ని లేదా దానికి సమానమైన నగదును తిరిగి ఇస్తారు. ఆభరణాలు పాత రూపంలో ఉండాలంటే ఇది పనికిరాదు.

నష్టభయం: ప్రైవేటు సంస్థలను నమ్మితే, వారు ఆలస్యం చేయడం లేదా దుకాణాన్ని మూసేయడం వంటి నష్టభయాలు ఉంటాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) కూడా ఈ రిస్క్‌ను హెచ్చరిస్తోంది. తిరిగి ఇచ్చేటప్పుడు స్వచ్ఛత తక్కువగా ఉండే బంగారం ఇస్తే పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి.

సురక్షిత వేదికలు: కొన్ని సంస్థలు (సేఫ్‌గోల్డ్, మానిటరీ మెటల్స్, గోల్డ్‌స్టార్మ్ వంటివి) బీమా, ఆడిట్, కెమెరాలు, ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగింగ్ వంటి సాంకేతికతలతో భద్రతను నిర్ధారిస్తున్నట్లు చెబుతున్నాయి.

గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (GMS): బ్యాంకుల్లో భద్రత

ప్రైవేటు వ్యక్తులతో రిస్క్ వద్దు అనుకునేవారికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పసిడి నగదీకరణ పథకం (GMS) సురక్షితమైన మార్గం. ఇది ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగంలోకి తీసుకురావడానికి ఉద్దేశించినది.

డిపాజిట్ వివరాలు:

కనీస పరిమితి: 10 గ్రాముల పసిడి (ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు) స్వీకరిస్తారు. అయితే ఆభరణాలపై ఉన్న రాళ్లను పరిగణలోకి తీసుకోరు. గరిష్ట పరిమితి లేదు. కేవైసీ పూర్తి చేసిన తర్వాత, బ్యాంకు తరఫున కలెక్షన్ ఏజెంట్ బంగారం స్వచ్ఛతను (999 ఫిన్నెస్) నిర్ధారిస్తారు.

మీరు మీ ఇంట్లో వృథాగా పడి ఉన్న బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టి అధిక అద్దె చెల్లిస్తున్నారా? ఆ ఖర్చు గురించి బాధపడేవారికి శుభవార్త! మీ బంగారాన్ని అద్దెకు ఇచ్చి లేదా డిపాజిట్ చేసి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. బంగారాన్ని కేవలం సంపదగా దాచుకోవడమే కాకుండా, దాని ద్వారా నిరంతర ఆదాయం పొందే అవకాశం లీజింగ్/గోల్డ్ మోనిటైజేషన్ పథకాల ద్వారా లభిస్తోంది. స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టినప్పుడు అద్దె వస్తున్నట్లే, ఇప్పుడు మీ పసిడిపై కూడా ప్రతిఫలం పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.