రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే స్వయంగా స్వాగతం పలికారు.
కాగా.. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ బస చేసే హోటల్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ లో బస చేసేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే.. ఆ హోటల్ సూట్ రూమ్ ఒకరోజు అద్దెతో.. మధ్యతరగతి కుటుంబాలు ఒక ఏడాదంతా దర్జాగా బ్రతికేయొచ్చని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. పుతిన్ స్టే చేసే హోటల్ ను ఆయన రాకముందే ఆ దేశ భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని గదుల్ని బుక్ చేసి, కారిడార్లను బారికేడ్లతో మూసివేశారు. ఎంట్రన్స్ వద్ద హైసెక్యూరిటీని ఏర్పాటు చేశారు. యాక్సెస్ కంట్రోల, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించి.. హోటల్ ను పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకున్నాయి.
ఈ హోటల్ లో పుతిన్ చారిత్ర ప్రాధాన్యమున్న చాణక్య సూట్ లో బస చేస్తున్నారు. 4600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ సూట్ ఒక రాత్రి అద్దె సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఉంటుందని తెలస్తోంది. రాజసం ఉట్టిపడేలా ఉండే ఇంటీరియర్, గోడలకు పట్టు వస్త్రంతో చేసిన ప్యానెల్స్, ఫ్లోరింగ్ కు ముదురురంగు చెక్కను ఉపయోగించారు. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్‌తో పాటు వాక్-ఇన్ క్లోజెట్, ప్రైవేట్ స్టీమ్ రూమ్, ఆవిరి స్నానాల గది (సౌనా), పూర్తిస్థాయి జిమ్, 12 మంది కూర్చునే డైనింగ్ రూమ్, ఆఫీస్ స్పేస్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. భోజనానికి విల్లెరాయ్ అండ్ బోష్ బ్రాండ్ క్రాకరీ, క్రిస్టల్ డి ప్యారిస్ గ్లాస్ వేర్ ను వాడుతారు.

































