అరుణాచలంలో “కార్తిగై దీపం” ముహూర్తం ఇదే – లక్షలాది భక్తుల రాక, ఎంతో ప్రత్యేకం

రుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్య లో భక్తులు హాజరవుతున్నారు. ప్రతీ పౌర్ణమికి అరుణాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


ఈ సారి మరో పౌర్ణమి వేళ మరో ప్రత్యేకత ఉంది. అరుణగిరి పై “కార్తిగై దీపం”గా వ్యవహరించే మహా దీపోత్సవం వీక్షిస్తూ గిరి ప్రదక్షిణ కోసం భక్తులు వేచి చూస్తారు. అలాంటి అరుదైన విశేషమైన ముమూర్తం ప్రకటించారు. ఈ కార్తిగై దీపం కు ఎన్నో ప్రత్యేకతలు.. విశేషాలు ఉన్నాయి.

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 కార్తీక దోపోత్సవాలు మొదలయ్యాయి. డిసెంబర్ 3న ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన మహాదీపోత్సవం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు 1,667 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు. అదేరోజున పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగిస్తారు. డిసెంబరు 4వ తేదీ రాత్రి అయ్యాన్‌గుంటలో చంద్రశేఖర స్వామి తెప్పోత్సవం, మర్నాడు పరాశక్తి అమ్మవారి తెప్పోత్సవం, 6వ తేదీన సుబ్రమణ్యస్వామి తెప్పోత్స వం ఉంటుంది. ఉత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన రాత్రి 9 గంటలకు చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహనంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.

కాగా, అరుణాచలేశ్వరుడి సన్నిధిలో డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. అదే రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని భరణి దీపం తోనే ప్రజ్వలింపజేస్తారు. “కార్తిగై దీపం”గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. కొన్ని మైళ్ దూరం వరకు కనిపించే ఈ దివ్య జ్యోతి పది రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. అందుకే ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ, గిరి ప్రదక్షిణ చేయాలని లక్ష లాది మంది భక్తులు ఈ పౌర్ణమికి అరుణాచలం చేరుకుంటారు. ఇదే రోజున అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి పెరియనాయగర్‌ అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా స్వర్గమయ వృషభ వాహనంపై ఊరేగుతూ గిరి ప్రదర్శన చేస్తాడు. దీంతో.. ఇప్పటికే అరుణాచలం లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ కార్తీక దీపం వేళ మరింతగా కొండంతా భక్తులతో నిండిపోనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.