సాధారణంగా సెలబ్రిటీలు వాడే ప్రతీ వస్తువు గురించి చాలా మంది ఆసక్తిగా తెలుసుకుంటారు. సినిమా హీరోలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, రాజకీయనాయకులు ఇలా పలువురు ప్రముఖులు వాడే కార్లు, ఫోన్లు, వాచ్, కళ్లజోడు ఇలా ప్రతీ వస్తువు గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటారు.
కొంత మంది సెలబ్రిటీలు ఖరీదైన వాటర్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిళ్లు ఏంటి? సెలెబ్రిటీలు ఎందుకు వాటిని తాగుతున్నారనే విషయం తెలుసుకుందాం!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిళ్లు ఇవే!
స్వాల్‌బార్డీ(Svalbardi )
ఈ అల్ట్రా-ప్రీమియం వాటర్‌ను ఉత్తర ధ్రువానికి సమీపంలోని స్వాల్‌బార్డ్ చుట్టూ ఉన్న ఫ్జోర్డ్(fjords)లలో కరుగుతున్న మంచుకొండల నుండి సేకరిస్తారు. ప్రతి బాటిల్‌లో 4,000 సంవత్సరాల పురాతనమైన స్వచ్ఛమైన నీరు ఉంటుందని, పరిమితమైన మోతాదులో సంవత్సరానికి కొన్ని సార్లు మాత్రమే ఈ నీటిని సేకరిస్తారని చెబుతారు. ఈ వాటర్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుందని చెబుతారు. గిఫ్ట్ ట్యూబ్‌తో కూడిన సాధారణ 750ml బాటిల్ ధర సుమారు రూ.9,195 ఉంటుంది. ఈ బ్రాండ్‌లోని కలెక్టర్స్ జాడే స్పెషల్ ఎడిషన్ సుమారు రూ. 5,52,000కు అమ్ముడైంది.
FILLICO బ్లాక్ కింగ్
ఈ జపనీస్ లగ్జరీ వాటర్ డ్రింక్ ఎంతో ప్రసిద్ధి చెందినది. బంగారం,స్వరోవ్స్కీ స్ఫటికాలతో బాటిల్ నెక్‌ను స్పెషల్‌గా అలంకరించిన, ఈ శాటిన్-గ్లాస్ కంటైనర్…అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్,మద్యం బాటిల్స్ ఆకారంలో ఉంటుంది. దీంతో సాధారణ మినరల్ వాటర్, ఎంతో అలంకారమైన వస్తువుగా కనిపిస్తుంది. సాధారణంగా దీనిని బహుమతిగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. బ్లాక్ కింగ్ ఎడిషన్ ఒక్క బాటిల్ ధర సుమారు రూ.3,44,736 వరకు ఉంటుంది.
Bling H2O Clear Blue
సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బాటిల్ వాడటంతో, దీనికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బ్లింగ్ H2O బాటిళ్లు స్వరోవ్స్కీ క్రిస్టల్స్(Swarovski crystals)తో తయారు చేయడతాయి. దీనినే “బ్లింగ్” అని పిలుస్తారు. “Clear Blue” మరియు ఇతర కొన్ని లిమిటెడ్ ఎడిషన్స్ పాప్ కల్చర్ ప్రియులకు ఎంతో ఇష్టమైనవి. ఈ వాటర్ బాటిల్ 750ml కస్టమ్ ఎడిషన్ ధర సుమారు రూ.2,26,800గా ఉంది.
ఎవియన్ జీన్ పాల్ గౌల్టియర్ (Evian Jean Paul Gaultier)
ఎవియన్ బ్రాండ్ ఇప్పటికే పాపులర్ బ్రాండ్ అయినప్పటికీ, జీన్ పాల్ గౌల్టియర్ కొలాబరేషన్‌తో ఈ కంపెనీని అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఎవియన్ డిజైనర్ బాటిల్స్‌లోని కొన్ని స్పెషల్ ఎడిషన్‌ల ధర సుమారుగా రూ. 35,952 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
నెవాస్ వాటర్ అపోరో(Nevas Water Aporro)
“champagne of waters”గా మార్కెటింగ చేసిన ఈ వాటర్ బాటిల్‌ను నెవాస్, రెండు జర్మన్ స్ప్రింగ్‌ల నుండి నీటిని కలిపి, దానిని అద్భుతమైన షాంపైన్-స్టైల్ గాజులో బాటిల్‌లో రెడీ చేస్తారు. ఈ బ్రాండ్ వాటర్ బాటిల్ మాగ్నమ్ డిజైన్ ఎడిషన్ (1.5 లీటర్) సుమారు రూ. 1,34,400గా ఉంది.
































