ఆదివారం బంద్ ఉండే ఏకైక రైల్వే స్టేషన్ ఇదే! .. కారణం తెలిస్తే బిత్తరపోతారు

ఒక స్టేషన్ మాత్రం ఆదివారం నాడు బంద్ ఉంటుందని మీకు తెలుసా? అవును, ఇది నిజమే. భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్ ఆదివారం రోజున మూసి ఉంచబడుతుంది.


భారత రైల్వే నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది. ప్రతి రోజు వేల సంఖ్యలో ట్రైన్లు దేశంలోని కోటిన్నరల మంది ప్రయాణికులను రవాణా చేస్తాయి. చిన్న గ్రామాల నుంచి మెట్రో నగరాల వరకు వేలాది రైల్వే స్టేషన్లు నిరంతరం పని చేస్తుంటాయి. అయితే, ఈ అంత పెద్ద వ్యవస్థలో ఒక స్టేషన్ మాత్రం ఆదివారం నాడు బంద్ ఉంటుందని మీకు తెలుసా? అవును, ఇది నిజమే. భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్ ఆదివారం రోజున మూసి ఉంచబడుతుంది. ఆ స్టేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు పనిచేయదు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రత్యేకమైన స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని బర్దమాన్‌ జిల్లాకు సమీపంలో ఉంది. బర్దమాన్‌ నగరం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‌ సాధారణంగా చిన్న ప్రయాణికుల రైళ్లకు సేవలు అందిస్తుంది. బాంకురా–మాసాగ్రామ్‌ ప్యాసింజర్‌ రైలు మాత్రమే ఇక్కడ ఆగుతుంది. కానీ ఆదివారం రోజున ఆ రైలు కూడా నడవదు. ఫలితంగా ఆ రోజు ఈ స్టేషన్‌ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది.

ఈ స్టేషన్‌ బంద్ ఉండడానికి కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ స్టేషన్‌కు నియమితుడైన స్టేషన్‌ మాస్టర్‌ ప్రతీ ఆదివారం బర్దమాన్‌ నగరానికి వెళ్లి రైలు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టేషన్‌లో మరే ఇతర సిబ్బంది ఉండరని కారణంగా ఆ రోజు టికెట్‌ కౌంటర్‌ పూర్తిగా మూసివేయబడుతుంది. అందువల్ల ప్రయాణికులకు సేవలు అందించడం సాధ్యం కాదు. దీనివల్ల రైల్వే శాఖ ఆ రోజున స్టేషన్‌ను పూర్తిగా మూసి ఉంచుతుంది.

ఈ స్టేషన్‌ గురించి మరో విశేషం ఏమిటంటే దీనికి అధికారిక పేరు లేదు. అయితే పాతకాలం నుంచీ “రాయ్‌నగర్‌” (Raynagar) అనే పేరు టికెట్లపై ముద్రితమవుతూ వస్తోంది. అంటే ఈ స్టేషన్‌ నుంచి టికెట్‌ తీసుకుంటే, దానిపై ‘రాయ్‌నగర్‌’ అని పేరు కనిపిస్తుంది. అధికారిక పేరు లేకపోయినా, ఈ స్టేషన్‌ స్థానిక ప్రజలకు చాలా అవసరమైనది. బాంకురా మరియు మాసాగ్రామ్‌ మధ్య ప్రయాణించే వారికి ఇది ఒక ముఖ్యమైన ఆగిపోయే స్థానం.

స్థానిక నివాసులు చెబుతున్నట్లుగా, ఈ స్టేషన్‌ చిన్నదైనా, గ్రామీణ ప్రాంతాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నగరాలకు వెళ్లే చిన్న వ్యాపారులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు ఈ స్టేషన్‌ను తరచుగా ఉపయోగిస్తారు.

నేటి ఆధునిక కాలంలో రైల్వే టికెట్లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా టికెట్‌ కౌంటర్లపైనే ఆధారపడుతుంటారు. అందుకే ఈ చిన్న స్టేషన్‌ వారికి ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా మారింది.

ఈ ప్రత్యేకమైన స్టేషన్‌ భారత రైల్వే చరిత్రలో ఒక విభిన్న గుర్తింపుగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా 24 గంటలు, 7 రోజులు పనిచేసే వందలాది స్టేషన్ల మధ్య ఆదివారం సెలవు ఉన్న ఈ ఒకే ఒక్క స్టేషన్‌ రైల్వే వ్యవస్థలో నిజంగా ఒక అరుదైన విశేషంగా చెప్పుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.