మహిళలకు ఇది కదా కావాల్సింది.. రికార్డ్‌ స్థాయిలో తగ్గిన బంగారం ధర

త కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టింది. రికార్డ్‌ స్థాయిలో పసిడి ధరలు తగ్గడం మహిళలకు శుభవార్తేనని చెప్పొచ్చు.


ప్రస్తుతం తులం ధర లక్ష రూపాయలకుపైగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం తులం ధరపై ఏకంగా 900 వరకు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ. రూ.1,01,400 వద్ద కొనసాగుతోంది. ఇదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,950 వద్ద ఉంది.

ఇక వెండి విషయానికొస్తే..ఇది కూడా రికార్డ్‌ స్థాయిలో తగ్గింది. కిలో వెండిపై ఏకంగా 2000 రూపాయల వరకు పతనమైంది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.1,15,000 వద్ద ఉంది. అయితే హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి 1,25,000 వద్ద ఉంది.

వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర.. మంగళవారం భారీగా తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,02,520 వద్ద ముగిసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఆగస్టు 8, శుక్రవారం నాడు, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.1,03,420కి చేరుకుంది. గత సెషన్‌లో 10 గ్రాములకు రూ.1,03,000 గరిష్ట స్థాయిలో ఉన్న 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం సోమవారం నాడు రూ.900 తగ్గి 10 గ్రాములకు రూ.1,02,100కి చేరుకుంది (అన్ని పన్నులతో సహా). శుక్రవారం వరకు గత ఐదు సెషన్లలో బంగారం 10 గ్రాములకు రూ.5,800 పెరిగింది.

తగ్గుదలకు కారణాలు ఏమిటి?

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ ప్రకారం.. మార్కెట్లో సానుకూల వాతావరణం, సురక్షితమైన పెట్టుబడి సాధనాలకు డిమాండ్ తగ్గడం వల్ల బంగారం బలహీనపడింది. దీనితో పాటు రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఈ వారం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉద్రిక్తత కూడా తగ్గింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.