ఈ మొక్క షుగర్ వ్యాధికి దివ్యౌషధం.. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే

 ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి మార్పుల కారణంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతోంది.


ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. తరచూ మూత్రం రావడం, ఎక్కువగా దాహం వేయడం, ఉన్నట్టుండి బరువు కోల్పోవడం, అలసట వంటివి దీని లక్షణాలు. అయితే మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మనం ఇప్పుడు షుగర్‌ని కంట్రోల్ చేసే ఓ మొక్క గురించి తెలుసుకుందాం..

రక్తంలోని చక్కెరను తగ్గించడానికి, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి బిళ్ల గన్నేరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBI లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బిళ్ల గన్నేరు ఆకులకు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గించే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బిళ్ల గన్నేరు ఆకుల రసం, టీ ను షుగర్‌కు ఔషధంలా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో హైపోగ్లైసెమిక్‌ యాక్టివిటీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. బిళ్ల గన్నేరు ఆకులలో ఆల్కలాయిడ్స్, టానిన్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంతో పాటు.. అనేక వ్యాధులను నివారిస్తాయి. రక్తంలో చక్కెరపై బిళ్ల గన్నేరు ప్రభావాన్ని తెలుసుకోవడానికి, పరిశోధకులు తమ అధ్యయనంలో డయాబెటిక్ కుందేళ్లపై అధ్యయనం చేశారు. కుందేళ్లకు బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని తాగించారు. కుందేళ్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్‌ 16 నుంచి 31. 9 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు.

ముందుగా బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను సేకరించి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ వేళ్ళను ఎండబెట్టి.. పొడి చేసుకొని గాలి నీరు తగలకుండా భద్రపరచుకోవాలి.. ఉదయం పరగడుపున, రాత్రి ఆహామ్ తినే ముందు ఆ పొడిని అరగ్రాము తీసుకొని ఆ పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తినాలి.. అంతేకాదు.. ఆ మొక్క ఆకులను గానీ పువ్వులను గానీ రెండు మూడు ఉదయం పరగడుపున నమిలి తినాలి.. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే.. ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గుతుంది. బిళ్ళ గన్నేరు ఆకుల ను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది.

నోట్ :ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.