అటు అన్నంలోకి,ఇటు బ్రేక్ ఫాస్ట్ లో దోశ,ఇడ్లీలలో నంచుకోడానికి అయినా ఫర్ఫెక్ట్ చెట్నీ ఏదైనా ఉందంటే అందులో ముందువరుసలో ఉండేది టమాటో పచ్చడి(Tomato pachadi).
టమాటో పచ్చడి ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మాకు వంటలు రావు అనేవాళ్లు కూడా ఈ రెసిపీని సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు. టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటో
-కరివేపాకు
-పచ్చి శెనగపప్పు
-ఆయిల్
-చింతపండు
-ఆవాలు
-వెల్లుల్లి
-కారం
-ఉప్పు
-మినపప్పు
-మెంతుల పొడి
-ఆవ పొడి
-ఇంగువ
-పసుపు
-ఎండు మిరపకాయలు
టమాటో పచ్చడి తయారీ విధానం
-ముందుగా బాగా పండిన అరకేజీ టమాటోలను ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత టమాటో ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి అందులోనే నిమ్మకాయ సైజు అంత చింతపండు,3 టేబుల్ స్పూన్ల కారం,10 వెల్లుల్లి రెబ్బలు,రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద లోతుగా ఉండే పాన్ పెట్టి అందులో ముప్పావు కప్పు ఆయిల్ పోసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీస్పూన్ ఆవాలు,1 టీస్పూన్,1 టీస్పూన్ మినపప్పు,1 టీ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి ఆవాలు చిటపటలాడేవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో కచ్చాపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు,5 ఎండు మిరపకాయలు,మూడు రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ,అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపుకోండి.
-పోపు అంతా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుసుకున్న పచ్చడిని వేసుకోవాలి.
-మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించండి. -ఉడుకుతున్న సమయంలోనే వేయించి పొడి చేసిన మెంతుల పొడి పావు టీ స్పూన్,వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవ పొడి పావు టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి.
-పచ్చడి కొంచెం రుచి చూసి ఉప్పు ఉంటే ఓకే లేకుంటే మాత్రం కొంచెం వేసి కలుపుకోండి.
-ఇప్పుడు పచ్చడిలో ఆయిల్ పైకి తేలినదాకా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టీ టమాటో పచ్చడి రెడీ.
-ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నెలలపైనే నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే 20 రోజులదాకా నిల్వ ఉంటుంది.