ఇండియాలో టాప్- 10 రిచెస్ట్ యాక్టర్స్

ప్పుడు సినిమా అంటే కొన్ని వందలు, వేల కోట్ల రూపాయల బిజినెస్. దీంట్లో ఎక్కువ భాగం సెలబ్రిటీల ఫీజుకే వెళ్తుంది. ముఖ్యంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్స్ ఇప్పుడు భారీగా పెరిగాయి.


అందుకే సక్సెస్‌ఫుల్ హీరోలు భారీగా డబ్బు సంపాదించారు. ఆ డబ్బును తెలివిగా పెట్టిబడి పెడుతూ సంపదను వృద్ధి చేసుకుంటున్నారు. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఇండియాలో భారీగా ఆస్తులు సంపాదించిన టాప్-10 సెలబ్రిటీల లిస్ట్ చూద్దాం.

1. షారుఖ్ ఖాన్- రూ.12,931 కోట్లు:
కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆయన సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, బిజినెస్ వెంచర్లు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (VFX & ప్రొడక్షన్), ఐపీఎల్ టీమ్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. కిడ్జానియా (KidZania) వంటి ఇంటర్నేషనల్ ఎడ్యుటైన్‌మెంట్ బ్రాండ్లలో పెట్టుబడులు ఉన్నాయి.

2.నాగార్జున- రూ.5,000 కోట్లు:
సినిమాలు, పెట్టుబడులతో టాలీవుడ్ మన్మథుడు వేల కోట్లు సంపాదించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్-కన్వెన్షన్ సెంటర్, ఫేమస్ రెస్టారెంట్లు, హోటళ్లలో వాటాలు, మా టీవీలో గతంలో ఉన్న షేర్ ద్వారా కింగ్ భారీగా డబ్బు సంపాదించాడు. రియల్ ఎస్టేట్‌లో కూడా నాగార్జునకు పెట్టుబడులు ఉన్నాయి.

3. సల్మాన్ ఖాన్- రూ.3,225 కోట్లు:
సల్లూ భాయ్ సినిమాలు, ఎండార్స్‌మెంట్స్‌తో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’, ‘బీయింగ్ హ్యూమన్’ (Being Human) బ్రాండ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. బిగ్ బాస్ వంటి షోల హోస్టింగ్‌కు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘చింగారి’ వంటి స్టార్టప్‌లలో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.

4. హృతిక్ రోషన్- రూ.3,100 కోట్లు:
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్, తన ఫిట్‌నెస్ క్రేజ్‌ను బిజినెస్ ఐడియాగా మార్చుకున్నాడు. అతని సంపదలో మెజారిటీ షేర్ HRX అనే ఫిట్‌నెస్ బ్రాండ్‌ది. దీని మార్కెట్ విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. క్యూర్.ఫిట్ (Cure.fit) స్టార్టప్‌లో హృతిక్ మెయిన్ షేర్ హోల్డర్, బ్రాండ్ అంబాసిడర్ కూడా.

5. అక్షయ్ కుమార్- రూ.2,250 కోట్లు:
ఏడాదికి 4-5 సినిమాలు చేస్తూ ఏటా వందల కోట్లు సంపాదిస్తున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్. అతడికి విదేశాల్లో, ముఖ్యంగా కెనడాలో భారీ ఆస్తులు ఉన్నాయని టాక్. దాదాపు 40కి పైగా నేషనల్, ఇంటర్‌నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, వీటి ద్వారా కూడా వందల కోట్లు సంపాదిస్తున్నాడు.

6. అమీర్ ఖాన్- రూ.1,860 కోట్లు:
సినిమాలు తక్కువ చేసినా, ప్రతి సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. సొంత ప్రొడక్షన్ హౌజ్ ద్వారా సినిమాలు నిర్మిస్తూ లాభాలు అందుకుంటున్నాడు. టెక్నాలజీ, సస్టైనబిలిటీ రంగాలపై ఆసక్తితో ‘డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్’ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాడు.

7. చిరంజీవి- రూ.1,750 కోట్లు:
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లగ్జరీ ఇల్లు, బెంగుళూరులోని ఆస్తులతో పాటు పలు వ్యాపారాల్లో మెగాస్టార్‌కు పార్ట్నర్‌షిప్ ఉంది. చిరంజీకివి సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

8. అమితాబ్ బచ్చన్- రూ.1,680 కోట్లు:
సినిమాలు, కేబీసీ (KBC) హోస్టింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్, టెక్ స్టార్టప్‌లలో అమితాబ్ బచ్చన్ పెట్టుబడులు పెట్టాడు. క్యాడ్‌బరీ, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా భారీగా సంపాదిస్తున్నాడు.

9. వెంకటేష్- రూ.1,650 కోట్లు:
సీనియర్ తెలుగు హీరో వెంకటేష్‌కు సినిమాలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా భారీగా సంపద వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 పైగా థియేటర్ల నెట్‌వర్క్, స్టూడియోలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వీరి కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరులు.

10. రామ్ చరణ్- రూ.1,630 కోట్లు:
చిరంజీవి వారసుడు రామ్ చరణ్ హీరోగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అలాగే ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నాడు. ట్రూ జెట్ ఏవియేషన్ కంపెనీలో పార్ట్నర్‌షిప్ ఉంది. ‘అపోలో హెల్త్ సిటీ’ కుటుంబంతో రామ్ చరణ్‌కు బంధుత్వంతో పాటు సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.