ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 10 లక్షల ధరలోపు టాప్-5 ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే.

రద్దీగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ చేయడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అయితే క్లచ్, గేర్ మార్చే ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణించేందుకు, రూ. 10 లక్షల ధర లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నగరాల్లో నివసించే వారికి ట్రాఫిక్ కష్టాలు కొత్తేమీ కాదు. ఇరుకైన రోడ్లు, భారీ వాహనాల రద్దీ మధ్య వాహనాన్ని నడపడం ఒక ఎత్తైతే, పార్కింగ్ స్థలం వెతకడం మరో సమస్య. ఇలాంటి సమయాల్లో హ్యాచ్‌బ్యాక్ కార్లు పనికొస్తాయి! ఇవి నడపడానికి సులభంగా ఉండటమే కాకుండా, వీటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువ. మరీ ముఖ్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కారు అయితే, పదే పదే క్లచ్ ప్రెస్​ చేసే బాధ కూడా ఉండదు. ట్రాఫిక్​లో స్మూత్​గా డ్రైవ్​ చేయొచ్చు.


మరి మీరు కూడా ఆటోమేటిక్​ హ్యాచ్​బ్యాక్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలో రూ. 10లక్షల బడ్జెట్​లోపు లభిస్తున్న టాప్​-5 ఆటోమేటిక్​ హ్యాచ్​బ్యాక్​ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రూ. 10లక్షల ధరలోపు బెస్ట్​ ఆటోమేటిక్​ హ్యాచ్​బ్యాక్​లు..
మోడల్​ వేరియంట్లు ఫ్యూయెల్​ ఎక్స్​షోరూం ధర
మారుతీ సుజుకీ ఆల్టో కే10
  • వీఎక్స్​ఐ (ఓ)
    • వీఎక్స్​ఐ+ (ఓ)
పెట్రోల్​ రూ. 4.95 లక్షలు – రూ. 5.45 లక్షలు
టాటా టియాగో
  • ఎక్స్​టీఏ
  • ఎక్స్​జెడ్​ఏ
  • ఎక్స్​జెడ్​ఏ ఎన్​ఆర్​జీ
  • ఎక్స్​టీఏ సీఎన్జీ
  • ఎక్స్​జెడ్​ఏ సీఎన్జీ
    • ఎక్స్​జెడ్​ఏ ఎన్​ఆర్​జీ సీఎన్జీ
  • పెట్రోల్​
    • సీఎన్జీ
రూ. 6.31 లక్షలు – రూ. 8.10 లక్షలు
మారుతీ సుజుకీ స్విఫ్ట్​
  • వీఎక్స్​ఐ
  • వీఎక్స్​ఐ (ఓ)
  • జెడ్​ఎక్స్​ఐ
  • జెడ్​ఎక్స్​ఐ+
పెట్రోల్​ రూ. 7.04 లక్షలు – రూ. 8.65 లక్షలు
హ్యుందాయ్​ ఐ20
  • మాగ్నా
  • స్పోర్ట్స్​
  • స్పోర్ట్స్​ (ఓ)
  • ఆస్టా (ఓ)
  • ఆస్టా (ఓ) నైట్​
  • ఆస్టా డీటీ
  • ఆస్టా (ఓ) డీటీ నైట్​
పెట్రోల్​ రూ. 8.13 లక్షలు – రూ. 10.52 లక్షలు
సిట్రోయెన్​ సీ3ఎక్స్​
  • షైన్​ టర్బో
పెట్రోల్​ రూ. 9.05 లక్షలు

1. మారుతీ సుజుకీ ఆల్టో కే10

దీనిని ముద్దుగా ‘లార్డ్ ఆల్టో’ అని పిలుచుకుంటారు. ఇది హ్యాచ్​బ్యాక్స్​లోనే రారాజు! ఈ ఆల్టో కే10 కారు మధ్యతరగతి వారికి అత్యంత ప్రియమైనది, అనువైనది. నగరం లోపల అయినా, లాంగ్ డ్రైవ్స్ లేదా కొండ ప్రాంతాలైనా ఇది అలవోకగా దూసుకుపోతుంది. ఇందులోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మంచి మైలేజీని ఇస్తుంది. దీని వీఎక్స్​ఐ (ఓ), వీఎక్స్​ఐ+ (ఓ) వేరియంట్లలో ఏఎంటీ (ఆటోమేటిక్) ఫీచర్ లభిస్తుంది.

ధర: రూ. 4.95 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఫీచర్లు: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు.

2. టాటా టియాగో

ఈ జాబితాలో అత్యంత సురక్షితమైన కారు ఈ టాటా టియాగో! ఈ హ్యాచ్​బ్యాక్​కి గ్లోబల్ ఎన్​సీఏపీ రేటింగ్‌లో 4 స్టార్స్ వచ్చాయి. పెట్రోల్‌తో పాటు సీఎన్జీ వెర్షన్‌లో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వడం దీని ప్రత్యేకత. మైలేజీతో పాటు సేఫ్టీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్!

ధర: రూ. 6.31 లక్షల నుంచి రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

వేరియంట్లు: ఎక్స్​టీఏ, ఎక్స్​జెడ్​ఏ, ఎక్స్​జెడ్​ఏ ఎన్​ఆర్​జీ, సీఎన్జీ వెర్షన్లు.

3. మారుతీ సుజుకీ స్విఫ్ట్

గత 20 ఏళ్లుగా ఇండియన్ రోడ్లపై స్విఫ్ట్ హవా నడుస్తోంది. ప్రస్తుతం నాల్గొవ తరం స్విఫ్ట్ మార్కెట్లో ఉంది. దీని 1.2 లీటర్ ఇంజిన్ నమ్మదగిన పనితీరును ఇస్తుంది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, దీని రీసేల్ వాల్యూ కూడా ఎక్కువే.

ధర: రూ. 7.04 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఫీచర్లు: వైర్‌లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, టచ్‌స్క్రీన్ సిస్టమ్.

4. హ్యుందాయ్ ఐ20

హ్యాచ్‌బ్యాక్ కార్లలో ప్రీమియం ఎక్స్​పీరియెన్స్​ని ఇచ్చే కారు ఈ హ్యుందాయ్​ ఐ20. డిజైన్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి కిక్ ఇస్తుంది. టెక్నాలజీ ప్రియులకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి!

ధర: రూ. 8.13 లక్షల నుంచి రూ. 10.52 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఫీచర్లు: సన్‌రూఫ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం ఇంటీరియర్స్.

5. సిట్రోయెన్ సీ3ఎక్స్​

కొత్తదనంతో పాటు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి సిట్రోయెన్ సీ3ఎక్స్​ సరిగ్గా సరిపోతుంది. ఇందులో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది కారుకు స్పోర్టీ లుక్‌ను, వేగాన్ని ఇస్తుంది.

ధర: రూ. 9.05 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

ప్రత్యేకత: వినూత్నమైన డిజైన్, టర్బో ఇంజిన్ పవర్.

“మీ అవసరాలకు తగ్గట్టుగా.. బడ్జెట్ తక్కువైతే ఆల్టోను, భద్రతకు ప్రాధాన్యత ఇస్తే టియాగోను లేదా స్టైల్ కావాలంటే స్విఫ్ట్, ఐ20లను ఎంచుకోవచ్చు,” అని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.

సిటీ లైఫ్‌లో హాయిగా డ్రైవ్ చేయాలనుకునే వారికి ఈ ఐదు కార్లు బెస్ట్ ఆప్షన్లు!

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.